- Advertisement -
చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ శనివారం విడుదల
Allu Arjun was released from Chanchalguda Jail on Saturday
హైదరాబాద్ డిసెంబర్ 14
చంచల్‌గూడ జైలు నుంచి నటుడు అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలయ్యారు. చంచల్‌గూడ జైలు వెనుక గేటు నుంచి అల్లు అర్జున్‌ను అధికారులు పంపించారు. ఎస్కార్ట్ వాహనం ద్వారా నివాసానికి అర్జున్‌ను పోలీసులు పంపించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతి చెందడంతో శుక్రవారం సాయంత్రం అల్లు అర్జున్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. అర్జున్‌కు మధ్యంతర బెయిల్ హైకోర్టు ఇచ్చింది. మధ్యంత బెయిల్ వచ్చినా కూడా రాత్రంతా ఆయన జైలులోనే ఉన్నారు. ప్రక్రియ ఆలస్యం కావడంతో శనివారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు.
- Advertisement -