Sunday, September 8, 2024

నిజామాబాద్ కోసం ఎత్తులు

- Advertisement -
Congress .... will the hopes come true ...
Altitudes for Nizamabad

నిజామాబాద్, జనవరి 5,
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం.. అక్కడ గెలిస్తే జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందనే కొంత కాలంగా ఉన్న సెంటిమెంట్. అందుకే నిజామాబాద్ లోక్‌సభ స్థానంపై హస్తం పార్టీ ఫోకస్ పెంచింది. బలమైన అభ్యర్ధిని పోటీకి పెట్టాలని ఆ పార్టీ అభ్యర్ధి అన్వేషణలో ఉంది. అయితే ఆ బలమైన అభ్యర్ధి తామేనంటూ.. ఇందూరు జిల్లా నేతలతో పాటు జగిత్యాల జిల్లా నాయకులు టికెట్‌ కోసం పోటీ పడుతున్నారట. ఇలా ఇప్పటి వరకు అరడజన్ మంది ఆ సీటుపై కన్నేశారట. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, తెలంగాణ నుంచి ఆ పార్టీ అధినేత్రి సోనియా పోటీ చేసే అవకాశం ఉండటంతో.. జాక్ పాట్ తగులుతుందని ఆశపడుతున్నారట సదరు నేతలు. దీంతో నేనంటే నేను బలమైన నాయకున్ని అంటూ క్యూ కడుతున్నారట. ఓ వైపు ఎమ్మెల్సీ పదవిపై కన్నేసిన నేతలు.. మరోవైపు త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారట. ఇలా జిల్లా నుంచి అరడజన్ కు పైగా నేతలు ఆశావాహులుగా తయారయ్యారట. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సర్వేల ఆధారంగా టికెట్లు ఇచ్చిన నేతలు.. పార్లమెంట్ అభ్యర్ధుల ఎంపికలోనూ అచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.నిజామాబాద్ పార్లమెంట్ బరిలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అర్వింద్ పోటీ దాదాపుగా ఖరారైందట. కాంగ్రెస్ నుంచి జవవరి నెలలో అభ్యర్ధిని ప్రకటించే ఛాన్స్ ఉందని హస్తం పార్టీలో టాక్ నడుస్తోంది. దీంతో కాంగ్రెస్ అభ్యర్ధిగా తమ పేరు పరిశీలించాలని బాల్కొండ నుంచి పోటీ చేసిన ఓటమి పాలైన ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, అర్బన్ టికెట్‌ ఆశించి భంగపడ్డ మాజీ మేయర్ డి. సంజయ్, రూరల్ టికెట్‌ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారట. వీరితో పాటు జగిత్యాల జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్‌ను నిజామాబాద్ లోక్ సభకు పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని అధిష్ఠానం ఆలోచన చేస్తుందట.ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ముందస్తు ప్రయత్నాలు మొదలు పెట్టారట హస్తం పార్టీ నేతలు. నిజామాబాద్ ఎంపీ స్దానం ఒకప్పుడు కాంగ్రెస్ ఖాతాలో ఉండగా.. ఆ తర్వాత బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ ఖాతాలో చేరిందట. రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో.. పూర్వ వైభవం సాధించాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతుంది. ఇక్కడ గెలిస్తే.. జాతీయ స్దాయలో ఓ వెలుగు వెలిగిపోవచ్చని నేతలు నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో పోటీకి సై అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు మరో హీట్‌ను పెంచాయి. జనవరి నెలలో నిజామాబాద్ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే వారు ఎవరో తేలిపోనుందని పార్టీ వర్గాల టాక్. దీంతో ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నం అయ్యారు. ఆశావాహుల్లో ఆ గెలుపు గుర్రం ఎవరో తేలాలంటే.. మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్