రేప్ కేస్ ను ఛేదించన పోలీసులు

- Advertisement -

అల్వాల్ రేప్ కేస్ ను ఛేదించన అల్వాల్ పోలీసులు

Alwal police did not crack the Alwal rape case

ఓ మహిళ కుటుంబ సమస్యలతో అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి వెళ్తున్న క్రమంలో ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో గత నాలుగు రోజుల క్రితం అత్యాచారానికి గురైంది అని మేడ్చల్ డీసీపీ కోటి రెడ్డి తెలిపారు. ఈ కేసులో అల్వాల్ పోలీసులు, ఎస్వోటీ, సీసీస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితులను పట్టుకున్నట్లు కోటి రెడ్డి తెలిపారు. అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని అన్నారు. ఇద్దరు నిందితుల్లో ప్రధాన నిందితుడు సాయికిరణ్ గా, అతనికి సహకరించిన వ్యక్తిగా మహ్మద్ సలీంలను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ నెల 12న యప్రాల్ ప్రాంతానికి చెందిన మహిళ అల్వాల్ పోలీస్ట్ స్టేషన్ కు వచ్చి ఆటోలో వెళ్తున్న సమయంలో లోతుకుంటలోని దుర్గా బార్ వద్ద ఆటో ఆపిన సమయంలో ఇద్దరు నిందితులు సదరు మహిళను, ఆటో డ్రైవర్ ను బెదిరించి ఆటోలో సుచిత్ర, సికింద్రాబాద్ ప్రాంతాల్లో తిప్పుతూ చివరకు తిరిగి అల్వాల్ తీసుకుని వచ్చి రాజీవ్ రహదారి పక్కనే ఉన్న స్మశాన వాటిక దగ్గర మహిళను బలాత్కారం చేశాడని డీసీపీ కోటి రెడ్డి తెలిపారు. నిండితులిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మహిళ ప్రయాణం చేసిన ఆటో డ్రైవర్ శంకర్ ను కూడా ఇంకా విచారించాల్సి ఉందన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular