ప్రజల సేవ కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాం
Always available for public service
ప్రజలకు ఏ సమస్య ఉన్న నేరుగా కలవవచ్చు
అక్రమాలకు పాల్పడే వారు మానుకోవాలి
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో
నూతన ఎస్పి గా వచ్చిన డి.ఉదయ్ కుమార్ రెడ్డి
మెదక్
జిల్లా అదనపు ఎస్పి అడ్మిన్ ఎస్. మహేందర్ పుష్ప గుచ్చం ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు అనంతరం గౌరవ వందనం స్వీకరించి జిల్లా ఎస్పి గా బాధ్యతలు స్వీకరించ్చారు. 2016 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఇంతకు ముందు హైదరబాద్ సిటి సౌత్ వెస్ట్ జోన్ ఎస్పి గా పని చేసి ప్రస్తుతము మెదక్ జిల్లా ఎస్పి గా పదవి భాద్యతలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి డి. ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ. తాను ప్రజల సేవ కోసం తాను ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని ప్రజలకు ఏ సమస్య ఉన్న తనను నేరుగా కలవవచ్చనని అన్నారు. అలాగే జిల్లాలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే మానుకోవాలని లేదంటే అట్టి వారిపై చట్ట పరమైన కఠిన చర్యలు ఉంటాయని ప్రజా శాంతికి ఎవరైనా భంగం కలిగించాలని చూస్తే ఉరుకునేది లేదని శాంతిభద్రతల విషయంలో ప్రత్యేక చర్యలు చేపడతాం. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లను సందర్శిస్తా. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటా. నేరాలు కట్టడి చేసేందుకు నిఘా సారిస్తాం. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మహిళల పై జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం వారి కోసం షీ టీమ్ ద్వారా మహిళలు, యువతుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడతాం, నేరాల అదుపనకు రాత్రి వేళల్లో పెట్రోలింగ్, గస్తీ ముమ్మరం చేస్తాం. విజిబుల్ పోలీసింగ్ విధానాన్ని మరింత పటిష్టం చేస్తాం. సంఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకునేలా ప్రణాళికలు రూపొందిస్తాం. రౌండ్ ది క్లాక్ పోలీసింగ్ వ్యవస్థను మరించి పటిష్టం చేస్తాం అని అన్నారు. తరచుగా నేరాలు చేసే వారు తమ పద్దతి మానుకుని సమాజంలో మంచిగా బతకాలని అలాగే ప్రజలు పోలీస్ స్టేషన్ కు వివిధ రకాల అభ్యర్థనలు, ఫిర్యాదులు సమాచారం.. సహాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి తగు సేవలు అందించడంలో ముందుండాలని ప్రజలందరికీ పోలీస్ వ్యవస్థ పై నమ్మకం విశ్వాసం కలిగేలా విదులు నిర్వహించాలని బాధితులతో మర్యాదపూర్వకంగా స్నేహపూర్వకంగా వ్యవహరించాలని అన్నారు. జిల్లా కు వచ్చిన నూతన డి. ఉదయ్ కుమార్ రెడ్డి మెదక్ సబ్ డివిజన్ డిఎస్పి డా.రాజేష్ తూప్రాన్ సబ్ డివిజన్ డిఎస్పి వెంకట్ రెడ్డి సైబర్ సెల్ డిఎస్పి ఎస్‌ఆర్.సుభాష్ చంద్ర భోస్ ఏఆర్ డిఎస్పి ఎస్‌ఆర్ రంగ నాయక్ గారు, జిల్లా సిఐలు మరియు ఆర్ఐ లు, ఎస్ఐ లు ఏ.ఆర్ ఎస్ఐ లు డిపిఓ సిబ్బంది కలవడం జరిగినది.