నేషనల్ బెస్ట్ యాక్టర్ – “కలర్ ఫోటో” ఫేమ్ సుహాస్ హీరో గా నటించిన కొత్త సినిమా – అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ టీజర్ నిన్న గ్రాండ్ గా ఏడుగురు డైరెక్టర్స్ సాక్షి గ్రాండ్ గా రిలీజ్ అయింది.
మన ఇంటి పక్కన మాములు గా తిరిగే కుర్రాడు గా సుహాస్ మనకి, కలరఫోటో, రైటర్ పద్మభూషణ్ సినిమాల తో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. అలాంటి సుహాస్ హీరో గామెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని, జి ఏ 2 పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మించిన, కొత్త సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ టీజర్ ప్రముఖ డైరెక్టర్లు – మారుతి, హను రాఘవపూడి, శైలేష్ కొలను వంటి ఏడుగురు ప్రముఖ డైరెక్టర్ల ప్రెసెన్స్ లో ఘనం గా రిలీజ్ అయింది.

మనకు టీజర్ చూడంగానే అర్ధం అయేది ఏంటంటే, అంబాజీపేట లో, మల్లిఖార్జున సెలూన్ షాపు లో హెయిర్ కటింగ్ చేస్తూ, బ్యాండ్ పార్టీ నడిపిస్తుంటాడు – మల్లి అనబడే హీరో పాత్రధారి – సుహాస్. అదే వూళ్ళో, ఉండే లక్ష్మి తో ( శివాని ) తో లవ్ ట్రాక్, వీటి మధ్య లో, జగదీశ్ ( పుష్ప లో కేశవ ఫేమ్) గోపరాజు రమణ, శరణ్య, ల మధ్య లో వచ్చే సీన్లు చక్కని టెంపో ని బిల్డ్ అప్ చేసి, సినిమా మీద మంచి క్యూరియసిటీ ని పెంచాడు – దర్శకుడు – దుష్యంత్ కటికినేని.
శేఖర్ చంద్ర బాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. వాజిద్ బేగ్ ఫోటోగ్రఫీ లో అంబాజీపేట చుట్టూతా ఉండే గోదావరి అందాల్ని అందం గా చూపించాడు.
ఓవరాల్ గా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో, మనుషుల మధ్య ఉండే ఎమోషన్స్ ని కామెడీ టచ్ తో పండించిన మంచి ఫీల్ గుడ్ సినిమా అనిపిస్తుంది – అంబాజీపేట బ్యాండ్ పార్టీ టీజర్ చూస్తే.
చిన్న సినిమా అయినా, దాన్ని చక్కని మార్కెటింగ్ కాన్సెప్ట్స్ తో, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎలాగా థియేటర్స్ కి రప్పించచ్చో, ఎలా హిట్టు కొట్టచ్చో, చాయ్ బిస్కట్ లాంటి బ్యానర్లు ఈ మధ్య ప్రూవ్ చేశాయి.
చక్కని హానెస్ట్, ఒరిజినల్ కధ, కధనం తో, వస్తున్న అంబాజీపేట బ్యాండ్ పార్టీ సినిమా టీజర్ నిజమైన సినిమా ప్రేమికుల్ని అలరిస్తుంది – సినిమా కోసం ఎదురు చూసేట్టు చేస్తుంది అనడం లో ఎలాంటి డౌట్ లేదు. – సత్య కేశరాజు



