Sunday, September 8, 2024

కాంగ్రెస్ లో చేరడానికి బి ఆర్ ఎస్ పార్టీ నేతల రాయబారాలు ?

- Advertisement -

హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడానికి బి ఆర్ ఎస్ మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు తమకు అనుకూలమైన కాంగ్రెస్ నాయకులద్వారా రాయబాబారాలు మొదలు పెట్టారు. వీటిని కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తిమెజార్టీ సాధించి రాష్ట్రంలో డిసెంబర్ 7 న ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన విషయంవిదితమే. రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన దగ్గరనుండి అవినీతి అధికారులు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నకొద్దిమంది బి ఆర్ ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలలో వణుకు ప్రారంభమయింది అని చెప్ప వచ్చు .ముక్కుసూటిగావ్యవహరించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి తమ ఆస్తులకు, కాలేజీలకు రక్షణ కల్పించాలని సీనియర్ కాంగ్రెస్ నాయకుల ద్వారా రాయబారాలు నడుపుతున్నట్లు వినికిడి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం అయిన తర్వాత,కాంగ్రెస్ పార్టీ నుండి ఎలాంటి ఆహ్వానం లేకున్నా నిస్సిగ్గుగా, బి ఆర్ ఎస్ నుండి గెలిచిన కొద్ది మందిఎమ్మెల్యేలు, మంత్రులు, కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులద్వారా రాయబారాలు నడుపుతూ ఎలాగైనా పార్టీలోకి తీసుకునేవిదంగా చూడాలని, కోట్లాదిరూపాయలు ఇవ్వడానికి ఆఫర్ ఇచ్చి వేడుకుంటున్నట్లు సమాచారం. మంత్రి పదవి లేకుండా పట్టుమని పది రోజులు కూడా ఉండలేని పరిస్థితిలో బి ఆర్ ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు, అధికారదాహంతో అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజల ఆస్తులను బెదిరించి కబ్జా చేసిన తమఆస్తులను రక్షించుకోవడానికి, అధికార పార్టీలోకి మారితే తమ ఆస్తులకు రక్షణ ఉంటుందని బావించడమే వారి ముఖ్యఉద్దేశంగా కనపడుతున్నది. ఒకవేళ ఇలాంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే, కాంగ్రెస్ కు భవిష్యత్తు లో ప్రజలప్రజాగ్రహం చవి చూడక తప్పకపోవచ్చు. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ ఉన్న దృష్ట్యా ఇతర పార్టీలఎమ్మెల్యేలను పార్టీలో ఇప్పటికిప్పుడు చేర్చుకుంటే అవినీతి పరులను కాపాడిన అపవాదం ముతగట్టు కోక తప్పదు.  కాంగ్రెస్ పార్టీ నుండి ఎలాంటి ఆహ్వానంలేకున్నా, గతంలో అధికార పార్టీలో దొడ్డిదారిలో సొంతయూనివర్సిటీని దక్కించుకున్న మాజీ మంత్రి ఒకరు ప్రభుత్వం నుండి అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి కాంగ్రెస్పార్టీలో చేరడానికి సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి రాజకీయ విలువలు లేని వారిని పార్టీలో చేర్చుకుంటేదశాబ్ద కాలంగా అధికారంలేకుండా, ఎన్నో త్యాగాలు చేసిన నాయకులు, కార్యకర్తలు ఆహ్వానిస్తారా లేదా అడ్డుకుంటారాఅనేది కార్యకర్తల, గ్రౌండ్ స్థాయి నాయకుల చేతిలో ఉంది. ఒకవేళ కార్యకర్తలు, నాయకులను కాదని బి ఆర్ ఎస్ అవినీతిఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే వీరిని వ్యతిరేకించేవారు ప్రత్యామ్నాయంగా బి జె పి వైపు చూసే అవకాశాలుఉన్నాయి.జి ఎచ్ ఎం సి ఎన్నికల సమయంలో బి ఆర్ ఎస్ కు సమఉజ్జిగా కార్పొరేటర్లను గెలుచుకున్న బి జె పి అనూహ్యంగా శాసనసభ ఎన్నికలలో తెలంగాణలో వెనుకబడడానికి కారణం, బి జె పి.బి ఆర్ ఎస్ ఒకటే అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడంతో, బి ఆర్ ఎస్ కు కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం అని విశ్వసించి ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. బూకబ్జాదారులు అయిన బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే అక్రమ సంపాదనలో కాంగ్రెస్పార్టీకి బాగస్వామ్యం ఉందని అపవాదం రాగలదని  తస్మాత్ జాగ్రత్త అంటూ పలువురు నేతలు, కాంగ్రెస్ అభిమానులు హెచ్చరిస్తున్నారు.ఈ నేపద్యం లో  ఎల్బి  నగర్  బిఆర్ఎస్ ఎంఎల్ఏ సుదీర్ రెడ్డి తాను పార్టీని మార్చేది లేదని స్పష్టం చేసారు.కాగా దాదాపుగా గతం లో కాంగ్రెస్ పార్టీ ని వీడి బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ వాదులు తిరిగి తమ స్వంత గూటికి చేరాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్