- Advertisement -
అంబేద్కర్ మాకు మాత్రం ఆరాధ్య దైవ
Ambedkar is our idol
అంబేద్కర్ పేరు లక్షల, కోట్ల సారైనా నిత్యం స్మరిస్తూనే ఉంటాం
అంబేద్కర్ పేరు బీజేపీ నేతలకు ఫ్యాషన్ గా మారింది.
మనుస్మృతి అమలు చేసేందుకు బీజేపీ, సంఘ్ పరివార్ కుట్ర పన్నింది
కేంద్ర హోంశాఖ మంత్రి ఆమీషాను వెంటనే బర్తరఫ్ చేయాలి
టిపిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
హ్జ్య్దేరాబాద్ డిసెంబర్ 24
అంబేద్కర్ ను అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి ఆమీషాను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ పిసిసి ఆద్వర్యం లో ట్యాంకుబండ్ అంబేత్కర్ విగ్రహం నుండి ప్రారంభమైన నిరసన ర్యాలీ నిర్వహించారు.ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు ఈ భారీ ప్రదర్శన భారీ ర్యాలీజరిగింది అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు ఈ ర్యాలి లో టిపిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ , ఎంపి అనిల్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, జాతీయ నాయకుడు కొప్పుల రాజు డిసిసి అధ్యక్షలు రోహిన్ రెడ్డి సమీరుల్లా తదితరులు పాల్గొన్నారు.నిరసన ర్యాలీ ట్యాంకుబండ్ వద్దకు బారీగా తరలి వచ్చిన కాంగ్రెస్ నేతలు , కార్యకర్తలు..అంబేద్కర్ ప్రకార్డులను, నీలం రంగు దుస్తులను ధరించి ప్రదర్శనలో కార్యకర్తలు పాల్గొన్నారు.అనంతరం హైదరాబాద్ కలెక్టర్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ను అడ్రస్ చేస్తూ వినతి పత్రం అందించారు. ఈసందర్బంగా టిపిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అంబేద్కర్ పేరు లక్షల, కోట్ల సారైనా నిత్యం స్మరిస్తూనే ఉంటాం అంబేద్కర్ పేరు బీజేపీ నేతలకు ఫ్యాషన్ అయితే, మాకు మాత్రం ఆరాధ్య దైవ మన్నారు. మనుస్మృతి అమలు చేసేందుకు బీజేపీ, సంఘ్ పరివార్ కుట్ర పన్నిందని, తక్షణమే అమిత్‌షాను కేంద్ర మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసారు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని,అమిత్‌షాపై చర్యలు తీసుకునేంతవరకూ కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి నిరసనలు తెలిపి తే కుట్రపూరితమైన కేసులు నమోదు చేయడం సిగ్గుచేటు* ప్రజావ్యతిరేకతను గమనించి ఇప్పటికైనా ప్రధాని నరేంద్రమోదీ.. అమిత్‌షాపై చర్యలు తీసుకోవాలి. భారత రాజ్యంగ నిర్మాత అంబేద్కర్‌పై అమిత్‌షా వ్యాఖ్యలతో బీజేపీ పార్టీ ముసుగు తొలిగిపోయిందననేరు. అంబేద్కర్ పై అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. భారతీయుల ఆరాధ్యమైన అంబేద్కర్‌ను అవమానించిన బీజేపీ తీరును ప్రజాస్వామ్య రీతిలో ఎండగడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై కేసు నమోదు చేయడం సిగ్గుచేటు. దేవుడి పేరు వాడుకొని రాజకీయ లబ్ది పొందడం బీజేపీ నేతలకు అలవాటు మనుస్మృతిని, వర్కర్‌ను అనుసరించే మీరు అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి మీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేశారు నిత్యం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తప్పుపట్టే బీజేపీ నేతలు.. ఇప్పుడు అంబేద్కర్‌ను కూడా తూలనాడుతున్నారు. రాజ్యాంగాన్ని రిరక్షించుకోవడానికి బీజేపీపై పెద్దఎత్తున కాంగ్రెస్ పోరాడుతోందని తెలిపారు.
- Advertisement -