అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేడ్కర్ చేసిన కృషి మరువలేనిది
-రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
-మంథని బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు
మంథని
Ambedkar's efforts for the welfare of the downtrodden are unforgettable: - State IT Minister Duddilla Sridhar Babu
అణగారిన వర్గాల సంక్షేమం కోసం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ చేసిన కృషి మరువలేనిదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ దీర్ఘదృష్టితో దేశ భవిష్యత్తును ఊహించి,దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించి భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. అంబేడ్కర్ ఆశయాలను సాకారం చేయడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఆయన స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ వర్గాల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందని.ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి కీలక నిర్ణయాలతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. అణగారిన వర్గాల కోసం జీవితకాలం పోరాడిన దార్శనికుడు అని కొనియాడారు.
దళిత సోదరులు కమ్యూనిటీ హాల్ చాలా చిన్నదిగా ఉన్నదని మంత్రి శ్రీధర్ బాబు కు విన్నవించగా తక్షణమే స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు కోటి రూపాయలతో అత్యాధునిక అంగులతో కమ్యూనిటీ హాల్, స్టడీ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల,పట్టణ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్,ఎస్సీ సెల్ బిసి సెల్, మైనార్టీ సెల్, మహిళా కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.