అమిత్ షా క్షమాపణ చెప్పాలి

- Advertisement -

అమిత్ షా క్షమాపణ చెప్పాలి

Amit Shah should apologize

వనపర్తి
వనపర్తి జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎంపీ డాక్టర్ మల్లు రవి  వనపర్తి ఎమ్మెల్యే  తూడి మేఘా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఎంపి మల్లు రవి మాట్లాడుతూ దేశ ప్రజలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యంని కాపాడడం కోసం రక్షణ కవచం లాగా ఏర్పడి దేశాన్ని రక్షిచాలి అని  అన్నారు. అంబేద్కర్ ను అవమానం చేసి మాట్లాడిన బిజెపి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పి ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.భారత ప్రజలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రక్షించాలి. భారత పౌరులకు హక్కులు, స్వచ్చలను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించారు. వాటిని హరించకుండా భారత దేశ పౌరులు గట్టిగా సమాధానం చెప్పాలని అని అన్నారు. రాజ్యాంగానికి పట్టాదారులు ప్రజలు.రాజకీయ నాయకులు కౌలు దారులు లాంటివారు  కొద్దీ రాజులు ఉండిపోయేవారు మాత్రమే అన్ని అన్నారు.ప్రజాస్వామ్యం మీద దాడి చేసిన బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలి అని అన్నారు. పార్లమెంటులో అంబేద్కర్ కు జరిగిన అవమానాన్ని దేశం లో ఉన్న ప్రజలందరూ గమనించారు అన్ని అన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఇండియా కూటమి నేతలు పార్లమెంటులో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశాం అన్నారు. ప్రధానమంత్రి మోడీ,అమిత్ షా రాజ్యాంగం,ప్రజాస్వామ్యం పై దాడి చేస్తున్నారు అన్ని అన్నారు.ప్రజల హక్కులను కాలరాస్తున్న  కేంద్ర బిజెపి ప్రభుత్వంని గద్దె దించే విధంగా భారత పౌరులు కృషి చేయాలి అన్నారు
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ  భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడిన వ్యాఖ్యలను త్రీవంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్త కంఠంతో ఖండించారు అని అన్నారు
ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ చందర్ వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ మున్సిపల్ కౌన్సిలర్ బి వెంకటేశ్వర్లు చీర్ల సత్యం సాగర్ సుమిత్ర యాదగిరి సత్యమ్మ శరవంద చంద్రకళ ఎల్ఐసి కృష్ణ భువనేశ్వరి శ్యామ్ వినోద్ యూత్ కాంగ్రెస్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నందిమల్ల చంద్రమౌళి మండల నాయకులు గోపాల్ పేట్ మండల ఇంచార్జ్ సత్యశిల రెడ్డి వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆదిత్య రేవల్లి మండల అధ్యక్షులు పర్వతాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular