- Advertisement -
అమిత్ షా రాజీనామా చేయాలి
Amit Shah should resign
విశాఖపట్నం
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవ మానపరిచిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాం డ్ చేశారు. ఈ మేరకు విశాఖ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో జై బాపూజీ జై భీం జై సంవిధాన నినాదం బ్రోచర్ ను ఆమె ఆవిష్క రించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నిండు పార్లమెంటు సభలో హోమ్ మినిస్టర్ అమిత్ షా, అంబేద్కర్ను హేళన చేస్తూ వాఖ్యానాలు చేయగా, బిజెపి ఎంపీల నవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ని జపం చేస్తుందని, ఎందుకు జపం చేయకూడదని ఆమె బిజెపి నేతలను ప్రశ్నించారు. అంబేద్కర్ రాజ్యాంగమే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందని, దేశంలోని అన్ని వర్గాల వారికి ఓటు హక్కును రాజ్యాంగమే కల్పించింద న్నారు. భిన్న మతాలు కులాలను ఒకటిగా చేసింది ఆ రాజ్యాంగమే అన్నారు. అందరూ సమానంగా స్వేచ్ఛగా గౌరవంగా బ్రతకడానికి అంబేద్కర్ రాజ్యాంగమే కారణమని స్పష్టం చేశారు. అటువంటి రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ని కాంగ్రెస్ జపం చేస్తే తప్పేంటని, మీరు ఎందుకు జపం చేయట్లేదని నిలదీశారు. ప్రపంచమంతా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది అంటే దానికి అంబేద్కర్ కారణమన్నారు. అమిత్ షా వాక్యాలను జగన్, పవన్, కళ్యాణ్ చంద్రబాబు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.
- Advertisement -