Sunday, September 8, 2024

కొనసాగుతున్న రియల్ బూమ్

- Advertisement -

కొనసాగుతున్న రియల్ బూమ్
హైదరాబాద్, డిసెంబర్ 22
ప్రభుత్వాలు మారినా హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌కు ఢోకా లేదని రియల్‌ ఎస్టేట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలోనే అతిపెద్ద ప్రాపర్టీ మార్కెట్లలో ఒకటిగా నిలిచింది హైదరాబాద్. ధరలు పెరుగుతున్నా ఇళ్ల కొనుగోలు కోసం ఎగబడుతున్నారు జనం. ఈ ఏడాది నవంబర్ నెలలో ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ రికార్డు స్థాయిలో నమోదైనట్లు నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. చాలా ఏళ్లుగా హైదరాబాద్ మహానగరంలో రియల్ భూమ్ కొనసాగుతోంది . దేశంలోని అతిపెద్ద ప్రాపర్టీ మార్కెట్లలో ఒకటిగా ఉన్న ఈ భాగ్యనగరంలో సొంత ఇల్లు, ప్రాపర్టీల కోసం జనాలు ఎగబడుతున్నారు.ధరలు పెరుగుతున్నా ఇళ్లు, ప్రాపర్టీల కొనుగోళ్లు మాత్రమం తగ్గడం లేదు. నవంబర్‌లో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు, స్టాంప్ డ్యూటీల ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరినట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. ఈ నవంబర్ నెలలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు 25 శాతం పెరిగినట్లు తెలిపింది. మొత్తం 6,268 డీల్స్ పైగా జరిగినట్లు తెలిపింది. విలువ పరంగా చూసుకుంటే గతేడాది కన్నా ఈసారి 29 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. దీని ప్రకారం అధిక ధర కలిగిన ఇళ్లకే ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు పేర్కొంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక పాలసీ రేట్లను ఏప్రిల్ 2023 నుంచి యథాతథంగా కొనసాగించడంతో ఇళ్ల కొనుగోలుదారులకు ఊరట లభించింది. హైదరాబాద్ ప్రాపర్టీల విక్రయాల్లో స్థిరమైన వృద్ధి నమోదవుతున్నట్లు చెప్పారు. కొనుగోలుదారుల అభిరుచులకు తగినట్లుగా బిల్డర్స్‌ ఇళ్లను నిర్మిస్తున్నారు. పాటు లగ్జరీ ఇళ్లు కొనుగోలు చేయాలనుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.జనవరి నుంచి నవంబర్ 2023 మధ్య హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అదరగొట్టింది. జనవరి- నవంబర్ మధ్య రిజిస్ట్రేషన్ల విలువ, ప్రాపర్టీల విక్రయాలు పరంగా చూసుకుంటే ఈ కాలంలో హైదరాబాద్ లో 64,658 యూనిట్లు విక్రయమయ్యాయి. వాటి రిజిస్ట్రేషన్లు, స్టాంప్ డ్యూటీ ద్వారా మొత్తం రూ.34,205 కోట్లుగు ఆదాయం వచ్చినట్లు నివేదిక తెలిపింది. గత రెండేళ్ల కాలంలో చూసుకుంటే ఇదే అత్యధికమని పేర్కొంది. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్లో నాలుగు జిల్లాలు హైదరాబాద్, మెడ్చెల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డిలు ఉంటాయి.నవంబర్ 2023 నెలలో హైదరాబాద్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో అత్యధికంగా రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ధర ఉన్న ప్రాపర్టీలు ఉన్పాయి. రూ.25- 50 లక్షల మధ్య ధర కలిగిన ఇళ్లను జనాలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అలాగే రూ.1 కోటి ఆపైన విలువ కలిగిన ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు 13 శాతంగా ఉన్నాయి. అయితే, నవంబర్ 2022 నెలతో పోలిస్తే ఇది 7 శాతం పెరుగుదల.బెడ్‌రూమ్‌ ఇళ్లకు డిమాండ్‌ క్రమేణా పడిపోతున్నది. డబుల్ బెడ్‌రూమ్‌ల కంటే హైదరాబాద్‌లో 3బీహెచ్‌కే నివాసాలకు కొనుగోలుదారుల్లో ఆదరణ పెరిగింది. 56 శాతం నుంచి 58 శాతానికి చేరింది. నాలుగు బెడ్‌రూంలు ఉండే 4బీహెచ్‌కే నివాసాల కొనుగోళ్లూ 5 శాతం నుంచి 7 శాతానికి పెరగింది.ఫార్మాసిటీలో స్థానంలో రెసిడెన్షియల్‌ సిటీని నిర్మిస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ప్రభుత్వం తప్పకుండా ప్రోత్సాహం ఇస్తుందని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్