Sunday, February 9, 2025

జీవితంలో ఒక్కసారే ఇలాంటి అవకాశం వస్తుంది.. ‘ఛావా’ ప్రెస్ మీట్‌లో విక్కీ కౌశల్

- Advertisement -

జీవితంలో ఒక్కసారే ఇలాంటి అవకాశం వస్తుంది.. ‘ఛావా’ ప్రెస్ మీట్‌లో విక్కీ కౌశల్

An opportunity like this comes once in a lifetime.. Vicky Kaushal at the 'Chava' press meet

‘ఛావా’ చిత్రంలో ఓ దైవత్వం ఉంటుంది.. ప్రెస్ మీట్‌లో రష్మిక మందన్న
విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’.  దినేష్ విజన్ నిర్మాతగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రిలీజ్ కాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స్ ప్రస్తుతం ఊపందుకున్నాయి. ఈ ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో..
విక్కీ కౌశల్ మాట్లాడుతూ.. ‘ఛావా సినిమా కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో ప్రిపేర్ అయ్యాను. యుద్దాలు,గుర్రపు స్వారీల్లో శిక్షణ తీసుకున్నాను. వీటన్నంటికంటే కూడా ఛత్రపతి శంభాజీ మహారాజ్ అనే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం, నా మనసుని ఆ పాత్ర కోసం సన్నద్దం చేసుకోవడం సవాలుగా అనిపించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ శ్రీరాముని వంటి వారు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ సింహం వంటి యోధులు. ఈ పాత్రలను ఇంత కంటే గొప్పగా నేను వర్ణించలేను. లక్ష్మణ్ గారు మొదటి నుంచి కూడా నన్ను పాత్ర పేరుతోనే పిలుస్తుంటారు. నేను ఈ పాత్రను పోషించగలను అనే నమ్మకాన్ని అలా ఆయన నాలో ముందు నుంచీ కలిగిస్తూనే వచ్చారు. నిజమైన యోధుల కథను చెబుతున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించిన దినేష్ విజన్ గారికి, తెరకెక్కించిన లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. రెహమాన్ గారి సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. ఇలాంటి పాత్ర నాకు దొరకడం నా అదృష్టం. జీవితంలో ఒక్కసారే ఇలాంటి అవకాశం వస్తుంది. ఈ మూవీ చాలా గొప్పగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.
రష్మిక మందన్న మాట్లాడుతూ.. ‘‘ఛావా’ చిత్రంలో మాటలకు అందని భావం ఉంటుంది. ఇందులో ఓ దైవత్వం ఉంటుంది.. అంతులేని ప్రేమ ఉంటుంది.. అందుకే ఈ చిత్రాన్ని చేయాలని ఫిక్స్ అయ్యా.  ఈ మూవీని చూసిన ప్రతీ సారి నేను ఏడ్చేస్తాను. అంత అద్భుతంగా ఉంటుంది. ఏ ఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, జానే తూ అనే పాట అందరినీ మెస్మరైజ్ చేస్తుంటుంది. విక్కీ చుట్టూ అద్భుతమైన ఆరా ఉంటుంది. ఆయన పక్కన నిలబడితేనే ఓ మ్యాజిక్ జరుగుతుంది. ఛావా పాత్రకు విక్కీ అద్భుతంగా సెట్ అయ్యారు. అందుకే లక్ష్మణ్ సర్ విక్కీని ఈ పాత్రకు తీసుకున్నారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్