అభాగ్యులకు అండ…జగన్నాథం సంకల్పం…

- Advertisement -

అభాగ్యులకు అండ…జగన్నాథం సంకల్పం…

Anda for the unfortunate... Jagannath Sankalpa...

తిరుపతి

ఏ దిక్కు లేని వారికి దైవమే దిక్కు అంటారు. కానీ తిరుపతి నగరంలో అభాగ్యులకు అనాధలకు తను ఉన్నానంటూ వారికి చేదోడుగా నిలుస్తున్నారు స్థానికంగా ఉంటున్న జగన్నాథం. ఈయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులుగా ఉంటూనే వివిధ వ్యాపారాలు చేస్తుంటారు. తన సంపాదనలో అధిక శాతం దానధర్మాల కోసం వినియోగిస్తుంటారు. ప్రతిరోజు వివిధ ప్రాంతాలలో పశుపక్షాదాలకు ఆహారం అందించడంతోపాటు అనాధలకు అభాగ్యులకు సాయం అందిస్తుంటారు. ముఖ్యంగా ప్రతి శనివారం నగరంలో సంచరించే కుష్టు వ్యాధిగ్రస్తులకు, యాచకులకు, గంగిరెద్దుల వాళ్ళకి ఆహారాన్ని అందించి కొంత నగదును కూడా ఇస్తారు ఇది క్రమం తప్పకుండా ప్రతి శనివారం తిరుపతిలోని మున్సిపల్ పార్క్ వద్ద జరుగుతుంది. అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అన్న సూత్రాన్ని ఆచరించడమే తనకు తెలుసునని జగన్నాథం ఎప్పుడూ అంటూ ఉంటారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular