Sunday, September 8, 2024

మహిళను వివస్త్రను చేసిన … కుమారుడికి తల్లి  అండ

- Advertisement -

కన్నతల్లి సమక్షంలో కుమారుడి అరాచకం

హైదరాబాద్ , వాయిస్ టుడే: షాపింగ్ కోసం రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను లైంగికంగా వేధించాడో రాక్షసుడు. ఆమె తిరగబడే సరికి ఆమెపై కోపం పెంచుకొని దాడి చేయడం ప్రారంభించాడు. ఆమెను వివస్త్రను చేసి మరీ దారుణంగా హింసించాడు. అడ్డుకోబోయిన వారిపై కూడా అతడు దాడికి పాల్పడ్డాడు. అయితే అతడు ఇలా ప్రవర్తిస్తుండగా.. తల్లి పక్కనే ఉండి కుమారుడిని సమర్థించడం స్థానికులను నివ్వెరపోయేలా చేసింది.

తల్లి సమక్షంలో.. బట్టలను చింపి వివస్త్రను చేసి… మహిళపై దాడి

హైదరాబాద్ బాలాజీ నగర్ నడిరోడ్డుపై దారుణం చోటు చేసుకుంది. జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ నడిబొడ్డున సుమారు రాత్రి ఎనిమిది గంటల సమయంలో అందరూ చూస్తుండగా… యువతిపై ఓ కీచకుడు అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. షాపింగ్ కోసం రోడ్డుపై వెళ్తున్న గుర్తు తెలియని మహిళపై పెద్ద మారయ్య అనే వ్యక్తి లైంగికంగా వేధించాడు.  అయితే తిరగబడిన ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఇష్టం వచ్చినట్లుగా కొడుతూనే.. ఉన్నాడు. అందరూ చూస్తుండగానే ఆమె బట్టలన్నీ చింపేసి వివిస్త్రను చేశాడు. అడ్డుకునేందుకు వెళ్లిన స్థానికులపై కూడా పెద్ద మారయ్య దాడికి పాల్పడ్డాడు. అయితే పెద్ద మారయ్య ఇంత చేస్తున్నా.. పక్కనే ఉన్న తల్లి అతడినే సమర్థించడం గమనార్హం. అయితే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. బాధిత మహిళకు రక్షణ కల్పించారు. వేసుకునేందుకు బట్టలు ఇచ్చి సరుక్షితంగా ఇంటికి చేర్చారు. అయితే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు పెద్ద మారయ్యను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్