గంజాయి స్మగ్లింగ్ లో ఆంధ్రా పోలీసులు

- Advertisement -
Andhra police in ganja smuggling
Andhra police in ganja smuggling

మేడ్చల్
గంజాయి స్మగ్లింగ్ చేస్తూ సైబరాబాద్ బాలానగర్ టాస్క్ ఫోర్స్ పోలీస్ లకు ఇద్దరు  ఆంధ్రా పోలీసులు  దొరికిపోయారు. శుక్రవారం  ఉదయం బాచుపల్లి లో గంజాయి అమ్మడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్వోటీ  బాలానగర్ పోలీసులు అనుమానం తో ఒకమారుతి ఈకో వాహనాన్ని పట్టుకున్నారు. దాంటో పరిశీలించగా 22 కేజీల గంజాయి, 11 పాకెట్స్ లో లభించింది.  గంజాయి విలువ 8 లక్షలు. వాహనంలో ఉన్న వ్యక్తులను విచారించగా కాకినాడ లోని  మూడవ  బెటాలియన్ ఏపీఎస్పీ కి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ అని తెలిసింది. వీరు గంజాయి స్మగ్లింగ్ లో పెద్ద మొత్తం లో డబ్బు సంపాదించవచ్చు అనే ఆశ తో రంగంలోకి దిగారు.  ఆరోగ్యం బాగాలేదు అనే మిష తో సెలవు పెట్టి మొదటి సారిగా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడటం జరిగింది. బాచుపల్లీ పోలీస్ స్టేషన్ లో విచారణ జరుగుతుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular