- Advertisement -
అంగన్వాడీలు సమయపాలన పాటించాలి
Anganwadis should be punctual
సిడిపిఓ తేజేశ్వరి :
ఆళ్లగడ్డ
అంగన్వాడీ కార్యకర్తలు కచ్చితంగా సమయపాలన పాటిస్తూ అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించాలని ఆళ్లగడ్డ ఐ సి డి యస్ ప్రాజెక్టు అధికారిని తేజేశ్వరి అన్నారు. బుధవారం ఆళ్లగడ్డ పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయ ఆవరణంలో అంగన్వాడీ కార్యకర్తలకు సిడిపిఓ తేజేశ్వరి సెక్టార్ అంగన్వాడీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అంగన్వాడి కార్యకర్తలు ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ పార్వతి, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
- Advertisement -