పది ఫలితాల్లో అన్నమయ్య జిల్లా మొదటి స్థానం సాధించాలి
Annamaiya district should get first place in ten results
రాయచోటి ,ఫిబ్రవరి 5:
పదవ తరగతి ఫలితాల్లో అన్నమయ్య జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించాలని డిఆర్ఓ మధుసూదన్ ఆకాంక్షించారు .బుధవారం రాయచోటి పి సి ఆర్ గ్రాండ్ లో పదవ తరగతి పరీక్షలపై పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికిముఖ్యఅతిథిగా అన్నమయ్య జిల్లా డి ఆర్ ఓ మధుసూదన్ విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి ఫలితాలలో రాయలసీమలోనే అన్నమయ్య జిల్లాకు ప్రథమ స్థానం రావాలని పిలుపునిచ్చారు. దీని సాధనకై ప్రధానోపాధ్యాయులందరూ సమిష్టి కృషితో పనిచేయాలని సూచించారు. పదవ తరగతి పరీక్షలకు ఇక 25 రోజులు మాత్రమే సమయం ఉన్నదని ఈ సమయంలో విద్యార్థులకు ప్రణాళిక బద్దంగా ప్రతి సబ్జెక్టు ఏ విధంగా చదువుకోవాలో ముఖ్యమైన అంశాలను ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలో విపులంగా వివరించాలని సూచించారు .అలాగే పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికు లోను కాకుండా పరీక్షలు అంటే భయం లేకుండా సునాయాసంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యార్థుల్లో మనోధైర్యం నింపాల్సిందిగా పేర్కొన్నారు. ఈ కీలకమైన పరీక్షల సమయంలో విద్యార్థులు తగు జాగ్రత్తగా ఉండేలా వారికి తెలియజేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉందన్నారు .ఫలితాల్లో ఉత్తమ మెరుగైన మార్కులు సాధించేందుకు తగిన కిటుకులు, సూచనలు కచ్చితంగా ఇవ్వాలని తెలిపారు విద్యార్థుల కుఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా పదవ తరగతి ఉర్దూ మీడియం స్టడీ మెటీరియల్ నుఆవిష్కరించారు.రాష్ట్రంలోనే ప్రప్రధమంగా అన్నమయ్య జిల్లా నుండి ఉర్దూ మీడియం పదవ తరగతి స్టడీ మెటీరియల్ ను తయారుచేసారనీ సంబంధిత విషయ నిపుణులను అభినందించారు. అలాగే అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా సాధించిన గత మూడు సంవత్సరాల పదవ తరగతి ఫలితాలను వివరించి సమావేశంలో పాల్గొన్న ప్రధానుపాధ్యాయులకు దిశ నిర్దేశం చేశారు అలాగే డి సి ఈ బి అన్నమయ్య జిల్లా సెక్రెటరీ నాగముని రెడ్డి పదవ తరగతి ఉర్దూ మీడియం స్టడీ మెటీరియల్ తయారు చేయడానికి సహకరించిన డిఇఓ శివ ప్రకాష్ రెడ్డి మరియు డిప్యూటీ డిఇఓ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశానికి రాయచోటి డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి తో పాటు ప్రధానోపాధ్యాయులు, విషయ నిపుణులు షేక్ మొహమ్మద్ హాషిం ,షేక్ జాఫరుద్దీన్ ,షేక్ ఇలియాస్ భాష, సయ్యద్ రహ్మాన్, హాజిరాబాను, ఇమ్రాజ్ అలీ ఖాన్ మరియు ప్రధానోపాధ్యాయులు ఎన్ నరసింహారెడ్డి, శివారెడ్డి, జనార్ధన, ఎస్ మున్వర్ భాష, పాల్గొన్నారు.