అన్నార్తుల ఆకలి తీర్చే అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ
Annapurnamma Dokka Seethamma is the one who satiates the hunger of others
నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు
నరసరావుపేట,
అన్నార్తుల ఆకలి తీర్చే అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ అని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. శనివారం నరసరావుపేట మండలం లింగంగుంట్ల శంకరాభారతిపురం జిల్లా ఉన్నత పాఠశాలలో లూయీస్ బ్రెయిలి జయంతి సందర్బంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు భోజనం వడ్డీంచారు విద్యార్థులకు భోజనం తినిపించారు. వారితో కలిసి భోజనం చేసారు. విద్యార్థులతో పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా నరసరావుపేట శ్యాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ, ఇప్పటివరకు లేని విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నం బడి భోజనం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఎంతో ఉపయోగం కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది అన్నారు. మాది ప్రజల ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని తెలియజేశారు. ఆకలి తీర్చే అన్నపూర్ణమ్మ మహాతల్లి డొక్కా సీతమ్మ పేరు ఈ పథకానికి పెట్టడం మా ప్రభుత్వం ఈ పథకానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని తెలియజేశారు. విద్యార్థులకు ఆకలి తీర్చడం ఒక్కటే మా లక్ష్యం కాదు రుచికరమైన ఆరోగ్యకరమైన పోషక విలువలతో కూడిన ఆహారం అందించడమే మా ప్రభుత్వ బాధ్యత అన్నారు. విద్యార్థులకు ఆరు రోజులు ఆరు రకాల మెనూ వండి వడ్డిస్తున్నారు. విద్యార్థులకు వారానికి ఒకసారి ఐదు రోజులు ఉడికించిన గుడ్డు మూడు రోజులు వేరుశనగ బెల్లం చిక్కి మూడు రోజులు రాగి జావా అందిస్తున్నామన్నారు. ప్రాంతాలవారీగా ఆహారపు అలవాట్లు గౌరవిస్తూ ఆయా ప్రాంతాల ఆహార పదార్థాలను స్కూళ్లలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు అదేవిధంగా రాష్ట్రంలో పేద ప్రజలు ఆకలితో ఉండకూడదని ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్లోనూ ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు.