దేశంలో మరొక సారి మోడీ సర్కార్
• బిజెపి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం బూత్ స్థాయి సమ్మేళనం
• తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలలో గెలవడం ఖాయం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 8 2024: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సోమవారం హిమాయత్ నగర్ ఎక్స్ రోడ్ జేపిఎల్ కన్వెన్షన్ హాల్లోని చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బూత్ స్థాయి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల లో 3లక్షల మెజారిటీతో మనం గెలవ బోతున్నాం. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వివిధ పార్టీల నుండి ఇప్పటివరకు 5000 పైగా జాయిన్ అయ్యారు. గ్రామాల ప్రచారానికి వెళితే బిజెపికి ఓటు వేస్తామని అని ప్రజలు అంటున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ ఖాయమని చెప్తున్నారు యువకులు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ 17 స్థానాలలో విజయం సాధించడంతో హిందువులకి న్యాయం జరుగుతుంది. తెలంగాణ పోలీస్ శాఖలో కూడా లవ్ జిహాద్ జరుగుతున్నాయి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా సపోర్ట్ చేస్తున్నరు. త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేస్తే ముస్లిం లందరూ సహకరించారు. రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తే త్రిబుల్ తలాక్ చట్టాన్ని అమల్లోకి వస్తుందని జిఎస్టిని రద్దు చేస్తాం అని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిన ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేని ప్రభుత్వం.
కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడి 100 రోజులు అవుతున్న ఇప్పటివరకు రైతులకు న్యాయం చేసిన దాఖలాలు లేవు ముఖ్యంగా ధాన్యం కొనుగోలుపై 500 రుణ మాఫీ ఇస్తామని ఎన్నికల సమయంలో మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇప్పటివరకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. వంద రోజులు దాటిన రుణ మాఫీ చేయలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పటికైనా ప్రజలు పార్టీని నమ్మి వేస్తే మన బతుకులు ఇలాగే అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రెండో ఒకటే, బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఒక సీటు కూడా రాదు అని అన్నారు. తెలంగాణ లో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి పది సంవత్సరాలు పట్టింది కానీ కాంగ్రెస్ పార్టీకి కొద్ది రోజులు సమయం ఉన్నది.
చేవెళ్ల ప్రాంతం అభివృద్ధి చేయడానికి బిజెపి పార్టీ ముందుకు వస్తుంది అన్నారు. వికారాబాద్ అనంతగిరి కొండల్లో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయ అభివృద్ధికి 100 కోట్లు చేసిన బిజెపి పార్టీ. ఐకమత్యంతో కలిసి చేవెళ్ల ప్రజలు అందరూ కూడా బిజెపి కి పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. జూన్ తర్వాత లక్ష మందితో వికారాబాద్లో నరేంద్ర మోడీ సభ నిర్వహిస్తామని కార్యకర్తలకి చెప్పారు.