Wednesday, January 14, 2026

బ్లాక్ బస్టర్ మేకర్ సంపత్ నంది హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్- షూటింగ్ త్వరలో ప్రారంభం

- Advertisement -

చార్మింగ్ స్టార్ శర్వా, బ్లాక్ బస్టర్ మేకర్ సంపత్ నంది, కెకె రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ #Sharwa38 లో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్- షూటింగ్ త్వరలో ప్రారంభం

Anupama Parameswaran as heroine in blockbuster maker Sampath Nandi - shooting to begin soon

చార్మింగ్ స్టార్ శర్వా తన మేడిన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #Sharwa38ని ప్రారంభించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కొలాబరేషన్ శర్వా, దర్శకుడు సంపత్ నంది ఇద్దరికీ ఒక ముఖ్యమైన మైల్ స్టోన్ ని చూస్తోంది. ఈ గ్రిప్పింగ్, హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తారు. ఈ చిత్రం హైబడ్జెట్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతుంది. ప్రీ-ప్రొడక్షన్ విషయంలో కూడా టీం చాలా జాగ్రత్తలు తీసుకుంది.
ఈ చిత్రంలో వెరీ ట్యాలెంటెడ్ అనుపమ పరమేశ్వరన్ శర్వా సరసన హీరోయిన్‌గా నటించడానికి ప్రాజెక్ట్ లోకి వచ్చారు. పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు పేరుగాంచిన అనుపమ చేరిక సినిమా కథనానికి డెప్త్ జోడిస్తుంది. కథలో అనుపమ పాత్ర చాలా కీలకంగా వుండబోతోంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ అనుపమన రగ్గడ్ ఇంటెన్స్ అవతార్‌లో 1960ల నాటి సినిమా వరల్డ్ కి సరిపోయేలా దుస్తులు ధరించి కనిపించారు. పోస్టర్ ఆమె పాత్ర కథాంశానికి తీసుకువచ్చే బలం, సంక్లిష్టత గురించి తెలిజేస్తోంది.
1960ల చివరలో ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో సెట్ చేయబడిన #Sharwa38 ప్రేక్షకులను మరపురాని అనుభూతిని అందించబోతోంది. ఈ చిత్రం హై-స్టేక్స్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది.
ఈ సినిమా కోసం శర్వా స్పెషల్ గా మేకోవర్ అయ్యారు.
#Sharwa38 కి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు, సౌందర్ రాజన్ S సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా, అనుపమ పరమేశ్వరన్

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్