
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
హైదరాబాద్: జనవరి 04
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇటీవల తుంటి ఎముక సర్జరీ చేయించుకున్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను గురువారం పరామర్శిం చారు.
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని సీఎం జగన్ అడిగి తెలుసు కున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని కేసీఆర్ నివాసంలో జగన్ గులాబీ బాస్‌ను పరామర్శించారు.
కేసీఆర్‌తో లంచ్ తర్వాత జగన్ లోటస్ పాండ్‌లోని తన నివాసానికి వెళ్లను న్నారు. లోటస్ పాండ్ నివాసంలో విజయమ్మ ఉంటున్నారు.
దాదాపు రెండేళ్ల తర్వాత సీఎం జగన్ లోటస్ పాండ్ లోని ఇంటికి వెళ్లనున్నారు. అంతుకు ముందు తాడేపల్లి లోని తన నివాసం నుంచి జగన్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోగా బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజే శ్వర్ రెడ్డిలు స్వాగతం పలికారు.
అక్కడి నుంచి కేసీఆర్ ఇంటికి వెళ్లారు. జగన్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు.
అయితే ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్‌తో జగన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.