Friday, January 17, 2025

ఏపీ గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హౌస్ గా మారుతుంది

- Advertisement -

ఏపీ గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హౌస్ గా మారుతుంది

AP will become a global digital technology power house

చంద్రబాబు  నేతృత్వంలో 2047 విజన్ సాకారం అవుతుంది

పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు

విశాఖలో ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్ లో మంత్రి నారా లోకేష్

విశాఖపట్నం:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  నేతృత్వంలో 2047 విజన్ సాకారం అవుతుందని, ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హౌస్ గా మారుతుందని విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీ డీటీఐ(డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ), ఎస్టీపీఐ(సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్-2025 కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సమ్మిట్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఏడు రంగాల్లో ఐటీ అభివృద్ధి, డీప్ టెక్నాలజీ ప్రాముఖ్యత, స్టార్టప్ ల వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మట్లాడుతూ.. ఏపీలో సాంకేతిక అభివృద్ధికి దిశానిర్దేశం చేయనున్న ఈ సమ్మిట్ లో పాల్గొనడం చాలా గర్వంగా ఉంది. భవిష్యత్ లో ఏపీ గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ హబ్ గా మారుతుంది. ఇన్నోవేషన్, డీప్ టెక్ నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి సాధ్యపడుతుంది. అభివృద్ధికి ఇన్నోవేషన్ చాలా ముఖ్యం. ఏఐ, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, హెల్త్ టెక్, ఎడ్యుటెక్, ఎనర్జీ స్మార్ట్ సొల్యూషన్స్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ రోబోయే రోజుల్లో కీలకపాత్ర పోషించనున్నాయి. సామాజిక సమస్యల పరిష్కారానికి ఐటీ,ఎలక్ట్రానిక్స్,మెడ్ టెక్, స్మార్ట్ టెక్నాలజీస్ కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యరంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏవిధమైన మార్పులు తీసుకువచ్చిందో మనం చూశాం.

ఏపీని 2 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దుతాం

2047 నాటికి ఏపీని 2 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దుతాం. 2020 విజన్ భాగంగా చంద్రబాబునాయుడు ఐటీని అభివృద్ధి చేశారు. ఇప్పుడు విజన్ 2047లో భాగస్వామ్యం కావడం నా అదృష్టం. చంద్రబాబునాయుడు  సారథ్యంలో 2047 కలను సాకారం చేస్తాం. ఉద్యోగాలు పొందేందుకు, కల్పించేందుకు ఇన్నోవేషన్ తో పాటు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలో సమూల మార్పులు తీసుకువస్తాం. ఉన్నత విద్యను సంస్కరిస్తాం. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో ఏపీ ప్రస్తుతం 9వ స్థానంలో ఉంది. దీనిని 3వ స్థానానికి తీసుకువస్తాం. ఇందుకు పరిశ్రమ వర్గాలు తమవంతు సహకారం అందించాలి. విశాఖలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర సాంకేతిక విప్లవంలో ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్ తనవంతు పాత్ర పోషించాలి. సంక్షోభాలనే అవకాశాలుగా మలచుకోవాలని మా నాయకుడు చెప్పారు. ఇది మన అవకాశం.

అభివృద్ధిని వికేంద్రీకరిస్తాం

ఏపీ అభివృద్ధికి ప్రధాని ఎంతో సహకరిస్తున్నారు. నేడు 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాం. రాయలసీమలోని అనంతపూర్ కు కియా పరిశ్రమ రావడం ద్వారా తలసరి ఆదాయంలో 3వ స్థానంలో ఉండి గోదావరి జిల్లాలతో పోటీపడుతోంది. కర్నూలును రెన్యువబుల్ ఎనర్జీ హబ్ గా రూపొందిస్తాం. చిత్తూరు, కడపను ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా మారుస్తాం. గోదావరి జిల్లాలను ఆక్వా హబ్ గా మారుస్తాం. ఉత్తరాంధ్రకు త్వరలోనే ప్రపంచంలోనే అతిపెద్ద కెమికల్ పార్క్ రాబోతోంది. విశాఖకు డేటా సెంటర్ తీసుకువస్తాం. త్వరలోనే టీసీఎస్ రాబోతోంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను నెలకొల్పుతాం. పారిశ్రామికవేత్తలకు అన్ని విధాల సహకారం అందిస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీటీఎన్ఎఫ్ ఛైర్మన్ శ్రీధర్ కొసరాజుతో పాటు కేడీఈఎమ్ ఛైర్మన్ బీవీ నాయుడు, అలోన్ఓఎస్ కో-ఫౌండర్ సీపీ గుర్నాని, ఎస్టీపీఐ డైరెక్టర్  సి.కవిత, ఐటీఏఏపీ ప్రెసిడెంట్తి లక్ష్మీ ముక్కవిల్లి తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్