రూ.100 కోట్ల లంచం ఇవ్వడమే కాకుండా రూ.192.8 కోట్ల

- Advertisement -

హైదరాబాద్‌: దిల్లీ మద్యం కేసులోని ప్రధాన కుట్రదారుల్లో భారాస ఎమ్మెల్సీ కవిత ఒకరని.. కీలక లబ్ధిదారు అని.. ఆమే కింగ్‌పిన్‌ అని ఈడీ పేర్కొంది. ఈ వ్యవహారంలో ఆప్‌ నేతలకు రూ.100 కోట్ల లంచం ఇవ్వడమే కాకుండా రూ.192.8 కోట్లను కవిత అక్రమంగా ఆర్జించినట్లు వెల్లడించింది. ఆమెను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ దిల్లీలోని రౌజ్‌ఎవెన్యూ కోర్టులో శనివారం దాఖలు చేసిన పిటిషన్‌లో ఈడీ పలు విషయాలను వెల్లడించింది. ‘‘సౌత్‌ గ్రూప్‌నకు చెందిన కవిత, శరత్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ తదితరులు ఆప్‌ నేతలతో కలిసి కుట్ర పన్నారు. మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా రూపొందించినందుకు మధ్యవర్తుల ద్వారా ఆప్‌ నేతలకు లంచం రూపంలో రూ.100 కోట్లు సమర్పించారు. ఈమేరకు దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, అప్పటి ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాతో కవిత బృందం ఒప్పందం కుదుర్చుకుంది.
ఆప్‌ నేతలకు లంచం ఇచ్చినందున కవితకు అనుకూలంగా మద్యం విధానం రూపొందింది. అలాగే కవిత బినామీ అరుణ్‌రామచంద్రపిళ్లైకి ఇండోస్పిరిట్‌లో ఎలాంటి పెట్టుబడి లేకుండానే భాగస్వామ్యంతోపాటు మద్యం ఉత్పత్తిలో దేశంలోనే పేరొందిన పెర్నాడ్‌రికార్డ్‌ సంస్థలో డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారం దక్కింది. ఈక్రమంలోనే 2021-22 దిల్లీ మద్యం పాలసీలో ఎల్‌1గా నిలిచిన ఇండోస్పిరిట్‌కు అత్యధిక లాభాలు దక్కాయి. మద్యం పాలసీలో హోల్‌సేలర్లకు లాభాలవాటాను 12శాతానికి పెంచడం ద్వారా సౌత్‌గ్రూప్‌నకు లబ్ధి చేకూరడమే కాకుండా.. వాటిల్లో నుంచే ఆప్‌ నేతలకు అక్రమ నిధులు అందేలా కుట్ర జరిగింది. కవిత మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారణకు రావడంతో అరెస్ట్‌ చేశాం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular