ఎన్నికల వ్యయాన్ని మానిటరింగ్ చేసేందుకు అకౌంటింగ్ అధికారులను నియమించిన హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్
హైదరాబాద్, అక్టోబర్ 07: రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం నియోజకవర్గాల వారీగా ఎన్నికల వ్యయాన్ని మానిటరింగ్ చేయడానికి హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆకౌంటింగ్ అధికారులను నియమించారు. జిల్లా లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అకౌంటింగ్ వ్యయాన్ని మానిటరింగ్ టీమ్ ను నియమించారు.

ముషీరాబాద్ నియోజకవర్గానికి చార్మినార్ జోన్ ఆడిట్ సెక్షన్ సూపరింటెండెంట్ మిర్జా రాజా అలీ, జూనియర్ అసిస్టెంట్ అజయ్ కుమార్, జిపిఎఫ్ సెక్షన్ హెడ్ ఆఫీస్ కి చెందిన అజయ్ కుమార్ లను నియమించారు.
మలక్ పేట్ నియోజకవర్గానికి కూకట్ పల్లి జోన్ ఆడిట్ సెక్షన్ సూపరింటెండెంట్ రామ్మోహన్, ఖైరతాబాద్ జోన్ జూనియర్ ఆడిటర్ అనిల్ కుమార్ లను నియమించారు.
అంబర్ పేట్ నియోజకవర్గానికి కూకట్ పల్లి జోన్ ఆడిట్ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ గౌడ్, సీనియర్ ఆడిటర్ కె.నరేందర్ లను నియమించారు.
ఖైరతాబాద్ నియోజకవర్గానికి కూకట్ పల్లి జోన్ ఎఫ్.ఏ సెక్షన్ సూపరింటెండెంట్ రాజు, ఖైరతాబాద్ జోన్ ఆడిట్ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ బాబు లను నియమించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఖైరతాబాద్ జోన్ ఎఫ్.ఏ సెక్షన్ సూపరింటెండెంట్ రమేష్, ఎఫ్.ఏ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ కుమార స్వామి లను నియమించారు.
సనత్ నగర్ నియోజకవర్గానికి సికింద్రాబాద్ జోన్ ఆడిట్ సెక్షన్ సూపరింటెండెంట్ పద్మజ రాణి, ఆడిట్ సెక్షన్ జూనియర్ ఆడిటర్ భరత్ లను నియమించారు.
నాంపల్లి నియోజకవర్గానికి శేరిలింగంపల్లి జోన్ ఎఫ్.ఏ సెక్షన్ సూపరింటెండెంట్ లెనిన్ బాబు, ఖైరతాబాద్ జోన్ ఆడిట్ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ ఫర్జానా బేగం లను నియమించారు.
కార్వాన్ నియోజకవర్గానికి ఖైరతాబాద్ జోన్ ఆడిట్ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ శ్రీలత, కూకట్ పల్లి జోన్ ఆడిట్ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ భారతి లను నియమించారు.
గోషామహల్ నియోజకవర్గానికి పి.డి.ఎస్.జెడ్ -11 సూపరింటెండెంట్ ముబీన్ ఫాతిమా, పి.డి.ఎస్.జెడ్ -11 జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్ లను నియమించారు.
చార్మినార్ నియోజకవర్గానికి సికింద్రాబాద్ జోన్ ఎఫ్.ఏ సెక్షన్ సూపరింటెండెంట్ సయ్యద్ జియా ఉల్ల హుస్సేన్, చార్మినార్ సర్కిల్ హెల్త్ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ ఎం.డి ఖాదిర్ అలీ ఖాన్ లను నియమించారు.
చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి చార్మినార్ జోన్ ఎఫ్.ఏ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ ముభాషిర్ హుస్సేన్ ఖాన్, ఎఫ్.ఏ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ సాగర్ సక్సెన్ లను నియమించారు.
యాకత్ పుర నియోజకవర్గానికి సికింద్రాబాద్ జోన్ ఎఫ్.ఏ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ రమేష్ యాదవ్, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ లను నియమించారు.
బహదూర్ పుర నియోజకవర్గానికి ఎల్.బి నగర్ జోన్ ఎఫ్.ఏ సెక్షన్ సూపరింటెండెంట్ చంద్రమోహన్, జూనియర్ అసిస్టెంట్ బావ్మాతి లను నియమించారు.
సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఎల్.బి నగర్ జోన్ ఎఫ్.ఏ సెక్షన్ సూపరింటెండెంట్ సంజన, జూనియర్ అసిస్టెంట్ స్రవంతి లను నియమించారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి సికింద్రాబాద్ ఆడిట్ సెక్షన్ సిడిఓ పరమేశ్వరి, ఎఫ్.ఏ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ సురేష్ లను నియమించారు. రిజర్వ్ గా హెడ్ ఆఫీస్ ఎఫ్.ఏ సెక్షన్ సూపరింటెండెంట్ యాదమ్మ, హెడ్ ఆఫీస్ ఎఫ్.ఏ సెక్షన్ కార్కోన్ ఫసి అహ్మద్, హెడ్ ఆఫీస్ ఎఫ్.ఏ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ పవన్ కుమార్, హెడ్ ఆఫీస్ ఎఫ్.ఏ సెక్షన్ కార్కోన్ సురేష్ కుమార్, హెడ్ ఆఫీస్ ఎఫ్.ఏ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ సుభాష్, హెడ్ ఆఫీస్ ఆడిట్ సెక్షన్ జూనియర్ ఆడిటర్ మనోజ్, హెడ్ ఆఫీస్ ఆడిట్ సెక్షన్ సీనియర్ ఆడిటర్ చంద్రకాంత్, హెడ్ ఆఫీస్ ఆడిట్ సెక్షన్ సీనియర్ ఆడిటర్ గోపి, హెడ్ ఆఫీస్ ఆడిట్ సెక్షన్ జూనియర్ ఆడిటర్ రాజు, హెడ్ ఆఫీస్ ఆడిట్ సెక్షన్ జూనియర్ ఆడిటర్ ధనుష్, ఖైరతాబాద్ జోన్ ఆడిట్ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ మదుసూధన్, ఎల్.బి నగర్ జోన్ ఆడిట్ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ అరవింద్ బాబు లను రిజర్వు గా నియమించారు.



