Sunday, September 8, 2024

వైసీపీ నుంచి చేరికలు లేవా…

- Advertisement -

వైసీపీ నుంచి చేరికలు లేవా…
విజయవాడ, జనవరి 6,
ఏపీలో రాజకీయాలు రోజురోజుకు మారిపోతున్నాయి. అధికారంలోకి రావాలని టిడిపి, జనసేన భావిస్తుండగా.. రెండవసారి కూడా అధికారంలోకి వచ్చి ప్రతిపక్ష పార్టీలకు గట్టి సమాధానం ఇవ్వాలని అధికార వైసిపి భావిస్తోంది. అయితే అక్కడ టిడిపికి ఓవర్గం మీడియా అండగా ఉంది. అందుకే తిరువూరు అసెంబ్లీ స్థానానికి సంబంధించి కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాల మధ్య భారీ గొడవ జరిగింది. ఇరు వర్గాలు కొట్టుకోవడంతో చాలామంది గాయపడ్డారు. అందులో ఒక పోలీస్ కూడా ఉన్నారు. యాదృచ్ఛికంగా ఈ వార్త టీడీపీ అనుకూ మీడియాలో పెద్దగా ప్రసారం కాలేదు. ప్రచురణకు కూడా నోచుకోలేదు. ఒకవేళ ఇదే ఘటన వైసీపీలో జరిగి ఉంటే ఆ మీడియా ఎలా చేసి ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మాత్రమే కాదు ఆ వర్గం మీడియా ఎంత తాపత్రయపడినప్పటికీ జరగాల్సింది జరగడం లేదు.ఈసారి కూడా అధికారంలోకి రావాలని వైసిపి అధినేత జగన్ భావిస్తున్నారు. అందుకే దాదాపు 38 స్థానాలలో కొత్త వారికి లేదా ప్రస్తుతం ఉన్న వారిలోనే మార్పులు, చేర్పులు చేస్తున్నారు. అలాంటప్పుడు సహజంగానే ఇతర పార్టీలోకి నాయకులు వలస వెళుతుంటారు. ఇదే జరుగుతుందని టిడిపి, జనసేన భావించాయి. కానీ ఆ రెండు పార్టీలు భావించినట్టు వైసిపి నుంచి భారీగా చేరికలు ఉండటం లేదు. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, రామచంద్రయ్య, దాడి వీరభద్రరావు పక్కన పెడితే.. పెద్దపెద్ద తలకాయలు మాత్రం ఇంతవరకు అటు టిడిపిలో గాని ఇటు జనసేనలో గాని చేరిన దాఖలాలు లేవు. మరోవైపు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కి జగన్ టికెట్ ఇవ్వకపోవడంతో.. ఆయన నేరుగా షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలి అని నిర్ణయించుకున్నారు. అంతేతప్ప అటు జనసేన వైపుగాని.. ఇటు టిడిపి వైపు గాని ఆయన చూడలేదు.. ఇంతమంది ఎమ్మెల్యేలను మార్చుతున్నప్పటికీ వారు ఎందుకు ఇతర పార్టీలవైపు చూడడం లేదంటే..ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ, జనసేన కలసి పోటీ చేయబోతున్నాయి. సో ఇప్పటికే చాలా వరకు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఒక అంగీకారం కుదిరింది. అయితే ఇందులోకి వైసిపి నుంచి వచ్చే వారికి పెద్దగా ప్రాధాన్యం దక్కే అవకాశం లేదు. అలాంటప్పుడు వైసీపీ నుంచి ఆ పార్టీలోకి వెళ్లిన కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. సరిగ్గా దీన్ని గుర్తించే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వేళ రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్పునకు గురైన వైసిపి నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశం లేదు. అందుకే జగన్ చాలా ధైర్యంగా మార్పుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఇలా మార్పులు చేయకపోవడం వల్లే పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఓడిపోయాడు. అందుగురించే తను ఓడిపోవద్దనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మార్పులకు శ్రీకారం చుట్టారు. సీటు తగ్గకపోయినప్పటికీ చాలామంది వైసిపి నాయకులు పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్తున్నారంటే జగన్ స్కెచ్ ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.. కానీ ఇదే విషయాలను రాయలేక.. అటు టిడిపిలోకి ఆశించిన స్థాయిలో వలసలు లేక.. ఆ వర్గం మీడియా పడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు. మరి వచ్చే రోజుల్లో ఆ వర్గం మీడియా ఎలాంటి వక్రీకరణలకు దిగుతుందో వేచి చూడాల్సి ఉంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్