- Advertisement -
సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం
Are you going to Sankranti.. Be Carefull
వనపర్తి
సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ ఐపిఎస్ అన్నారు సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ విషయంలో వనపర్తి జిల్లా పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అయన పలు సూచనలు చేశారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నెంబర్‌ను సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకు తెలపాలి. దీంతో వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసుకుని ఊర్లెళ్లిన వారి ఇళ్లపై నిఘాను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని మీ ఇంటి దగ్గర గల మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్ళకు చెప్పడం మంచిది. వనపర్తి జిల్లాలో పోలీసులు సీఎస్ఆర్ సహకారంతో ఇప్పటికే సీసీటీవీ లను ఇన్ స్టాల్ చేశారు. తద్వారా ఎన్నో సంచలనాత్మక నేరాలను ఛేదించారు. ప్రజలు తమ కాలనీలు, ఇళ్లు, పరిసరాలు, షాపింగ్ మాళ్లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కారులలో పెట్టడం చేయరాదు.ద్విచక్రవాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలుపరాదు.అన్నారు
- Advertisement -