కొండాపూర్ / మియాపూర్
04-11-2023
మియాపూర్ నరేన్ గార్డెన్ ఫంక్షన్ హలులో నిర్వహించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ బూత్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం.
శేరిలింగంపల్లి నియోజకవర్గ బూత్ కమిటీ బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్తలు, నాయకుల సమావేశానికి హాజరైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .
సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరేకపూడి గాంధీ .
సమావేశానికి హాజరైన కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ , సహచర కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు.
సమావేశంలో మాట్లాడుతూ,
బీఆర్ఎస్ పార్టీకి సైనికులు లాంటి కార్యకర్తలు ఉన్నారని, వారు అందించే తోడ్పాటుతోనే ఈ రోజు మన బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా పని చేసుకుంటూ పోతున్నామని అన్నారు. ఏ పార్టీకి లేని నిజాయితీ కూడిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకు ఉండటం సీఎం కేసీఆర్ రాష్ట్రానికి చేసిన కృషి ఫలితమని అన్నారు.
సంక్షేమ, అభివృద్ధి పధంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న నిరాధరమైన ఆరోపణలకు ఇక్కడ ఉన్న ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. దేశంలో ఎక్కడ లేని పధకాలు మన తెలంగాణ రాష్ట్రంలో, మన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ గారు దూరదృష్టితో చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా రేపటి మన తెలంగాణ రాష్ట్ర భావి తరాల భవిష్యత్తుకు పునాది రాళ్లు అని తెలియజేశారు. ప్రతి ఒక్క కార్యకర్త ఈ ఎన్నికలలో కష్టపడి పని చేసి, మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని కేటీఆర్ కోరారు.