మున్నేరు వరద నియంత్రణకు పకడ్బందీ చర్యలు….
Armed measures to control Munner flood....
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
*మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం, భూ సేకరణపై సంబంధిత అధికారులతో సమీక్ష
ఖమ్మo
మున్నేరు వరద నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఖమ్మం మునిసిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం, భూసేకరణ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
మున్నేరు నది కిరువైపుల రిటైనింగ్ వాల్ నిర్మాణానికి బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్., డిజైన్, గత రికార్డుల ప్రకారం అత్యధిక నీటి ప్రవాహం స్థాయి ఎంత, రిటైనింగ్ వాల్ ఎంత ప్రవాహానికి ఎంత ఎత్తులో నిర్మించాలి వంటి అంశాలను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
బఫర్ జోన్ వధ్ద ఎంత భూమి ఆక్రమణకు గురైంది, మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఎంత సమయం పడుతుంది, ఎంత భూ సేకరణ చేయాలి, వచ్చే వానాకాలం నాటికి పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయా, రాబోయే వరదల నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలి వంటి వివరాలను తెలుసుకున్న కలెక్టర్ మ్యాప్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు.
అత్యధికంగా వరద ప్రవాహం ఉన్న సమయంలో మున్నేరు నది వద్ద 3 లక్షల 50 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చినా తట్టుకునేలా బఫర్ జోన్ నిర్దేశిస్తూ రిటైనింగ్ వాల్ డిజైన్ చేయడం జరిగిందని, రికార్డుల ప్రకారం మున్నేరు నది 36 మీటర్ల ఎత్తులో నీరు ప్రవహించిందని, దానిని పరిగణలోకి తీసుకుంటూ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రణాళికలు చేసినట్లు కలెక్టర్ కు సంబంధిత అధికారులు తెలిపారు.
మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ఆమోదం పొందిన డిజైన్ ప్రకారం అవసరమైన భూసేకరణ జరగాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, ఇరిగేషన్ ఎస్ఇ వెంకటేశ్వర రావు, ఇఇ అనన్య, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాసులు, ఖమ్మం అర్బన్, రూరల్ తహసీల్దార్ లు రవికుమార్, రాంప్రసాద్ లు, తదితరులు పాల్గొన్నారు.