సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంకు ఏర్పాట్లు
Arrangements for Soul Reunion of Singareni Retired Employees
-నేడు 250 మందితో సమావేశం
-సింగరేణి లో ఇదే మొట్టమొదటి సారి..
కమాన్ పూర్
సింగరేణి సంస్థ లో ప్రకృతి కి విరుద్ధంగా 30 నుంచి 40 సంవత్సరాలు ఉద్యోగాలు నిర్వహించి పదవి విరమణ(రిటైర్డ్) పొందిన ఉద్యోగులందరు ఒకే తాటిపైకి రావాలనే ఉద్దేశ్యం తో కొందరు రిటైర్డ్ ఉద్యోగుల నుండి ఈ ఆలోచన ఉద్బవించింది. దీనితో ఆర్జీ-3, ఏపిఎ డివిజన్ లకు చెందిన కొందరు రిటైర్డ్ ఉద్యోగులు ఒక వాట్స్ అప్ గ్రూప్ ను క్రెయేట్ చేశారు. దీనికి భారీ స్పందన లభించింది. విశ్రాంతి ఉద్యోగులు అందరు ఆదివారం జరిగే ఆత్మీయ సమ్మేళనానికి హాజరు కావాలని గ్రూప్ లో మెసెజ్ పెట్టారు. దీనికి అనుకున్న దానికన్నా భారీ స్పందన లభించింది. సుమారు 250 మంది రిటైర్డ్ ఉద్యోగులు వివిధ ప్రాంతాల నుండి ఈ ఆత్మీయ సమ్మేళనానికి వస్తున్నారు. ఒక్కొక్కరు తమ వంతుగా రూ.1000/- చెల్లించారు. సెంటినరీ కాలనీ లోని జేఎన్టీయూ కళాశాల ప్రాంతం లో ఉన్న సాయిరాం గార్డెన్ లో ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ముఖ్య అతిథులుగా ఇద్దరు జీఎంలు నరేంద్ర సుధాకర రావు, కొప్పుల వెంకటేశ్వర్లు హాజరు అవుతున్నారు. హాజరైన ప్రతి ఒక రిటైర్డ్ ఉద్యోగికి ఆయన, సతీమణి తో కూడిన ఫోటో అంటించిన ఒక మెమొంటో ను అందచేయనున్నారు. వివిధ ప్రాంతాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విశ్రాంతి ఉద్యోగులు అందరు ఒకే చోట కలిసి తమ గత స్మృతులను నెమరువేసుకోవడం తో పాటు ప్రస్తుత సాధకబాధలు పాలు పంచుకోవడానికి ఇది ఒక వేదికగా మారుతుందని చెప్పవచ్చు.