- Advertisement -
సామాన్యభక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు
Arrangements should be made so that common devotees do not face any difficulties
మూడు వేల సిసి కెమెరాలో నిఘా
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
తిరుమల
తిరుమలలో అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు వైకుంఠ ద్వార దర్శనం గూర్చి మాట్లాడుతున్నారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అని ఏర్పాట్లు చేసింది. 10 తేదీన ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం అవుతాయి. వైకుంఠ ఏకాదశి రోజు ఉ 8 గంటలకు సర్వదర్శనం ప్రారంభం అవుతుంది. టికెట్లు,టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి ఇస్తాం. 10 తేదీన ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వర్ణ రథం ఊరేగింపు వుంటుంది. అన్ని ప్రత్యేక దర్శనాలను పది రోజులు రద్దు చేశాం. టికెట్లు లేని భక్తులు తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకూడదని విజ్ఞప్తి చేసారు. సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో దర్శనాలను కల్పించేందుకు సిఫార్సు లేఖల దర్శనం రద్దు చేశాం. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యభక్తులకే పెద్దపీట వేస్తాం. సీఎం అదేశాల ప్రకారం సామాన్యభక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసాం. మైసూరు నుంచి వచ్చిన నిపుణులతో చేసిన పుష్పాలంకరణలు ఈసారి ప్రత్యేక ఆక్షర్షణ గా నిలుస్తాయి. 3 వేల సిసి కెమరాలతో నిఘా ఏర్పాటు చేసాం. గోవిందమాల భక్తులకు ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు ఉండదు….అందరు భక్తులతో కలిసి ఎస్ఎస్డి టోకన్లు తీసుకొని వైకుంఠద్వార దర్శనాలకు రావాలని విజ్ఞప్తి. టోకన్లు, టిక్కెట్లు లేని భక్తులను తిరుమలకు అనుమతించరని…కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులను ఎవరు ఆపరు…ఆపలేరు. అసత్య ప్రచారాలు, అపోహలు నమ్మవద్దని భక్తులను కోరుతున్నా. హెచ్ఎంపివి అనే కొత్త రకమైన వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో …భక్తులు మాస్క్ లాంటి స్వీయ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేసారు.
- Advertisement -