Friday, January 17, 2025

కోట్లాది మంది జీవితాలతో ముడిపడిన శాఖలు

- Advertisement -

కోట్లాది మంది జీవితాలతో ముడిపడిన శాఖలు

Branches connected with the lives of crores of people

గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమం

ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క

గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు రాష్ట్రంలో  కోట్లాదిమంది జీవితాలతో ముడిపడి ఉన్నాయి. ఈ శాఖల ద్వారా మెరుగైన సేవలు రాష్ట్ర ప్రజలకు అందాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి సీతక్క అన్నారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో ఈ శాఖలకు సంబంధించి వారు పలు అంశాలను చర్చించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నతనంలోనే మంచి పోషక ఆహారాన్ని అందించడం ద్వారా వారికి ఉజ్వలమైన భవిష్యత్తును ప్రసాదించే అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం తెలిపారు. వారిపై పెట్టే పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని అన్నారు. జువైనల్ హోమ్స్ లోని పిల్లల మానసిక పరిపక్వతకు క్రీడలు దోహదం చేస్తాయి, ఇందుకుగాను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నుంచి స్పోర్ట్స్ కిడ్స్ అందిస్తామని డిప్యూటీ సీఎం సంబంధిత అధికారులకు తెలిపారు. స్పోర్ట్స్ కిట్స్ అందజేయాల్సిందిగా క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డికి సమావేశం నుంచి సూచించారు. శిశు విహార్ లో ప్రస్తుతం ఉన్న శిశువుల సంఖ్య వారికి అందుతున్న సౌకర్యాలు, వైద్య సహాయం తదితర అంశాలపై మంత్రులు సమ్మె అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉన్న మహిళా ప్రాంగణాల పరిస్థితి పైన డిప్యూటీ సీఎం, మంత్రి సీతక్క ఆరా తీశారు. ప్రస్తుతం అవి నిరుపయోగంగా ఉన్నట్టు అధికారులు తెలియజేయడంతో వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేంద్రాల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులకు పెద్ద వ్యాపారాలకు పనికొచ్చే విధంగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. దివ్యాంగులకు స్వల్పకాలిక శిక్షణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాన్స్ జెండర్ ల సేవలను ప్రస్తుతం హైదరాబాద్ ట్రాఫిక్ కూడళ్ళలో వినియోగిస్తున్నారు, ఈ ప్రయోగం విజయవంతం అయితే మండల కేంద్రాల్లోనూ ట్రాన్స్ జెండర్ ల సేవలు వినియోగిస్తామని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. దీంతోపాటు ట్రాన్స్ జెండర్ ల క్లినిక్ సెంటర్లు దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే అందుబాటులో ఉన్నాయని మంత్రులు వివరించారు. కేంద్ర సౌజన్యంతో కొనసాగుతున్న పథకాలు, నిధుల విడుదల, భవిష్యత్తులో ఈ పథకాలకు సంబంధించిన ప్రణాళికలపై చర్చించారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేష్ కుమార్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనితా రామచంద్రన్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్