26వ తేది రాత్రి భారీ ఎత్తున జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం
స్వచ్ఛందంగా శివ భక్తులను యాగంటికి తరలించండి
27న కర్నూలులో టిటిడి ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం..
నంద్యాల: నంద్యాల జిల్లా యాగంటి క్షేత్రానికి అరుణాచల శోభను తెచ్చే యత్నంలో పాణ్యం శాసన సభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి నిమగ్నం అయ్యారు. నలభై సంవత్సరాల నుంచి యాగంటేశ్వరుని భక్తునిగా కొనసాగుతున్న రాంభూపాల్ రెడ్డి ఇటీవల అరుణాచల క్షేత్రానికి తరచు వెళ్తూ అరుణాచలేశ్వరుడిని భక్తుడిగా కొనసాగుతున్నారు. అయితే తనకు అనేక వరాలు ప్రకటించడనే నమ్మకంతో యాగంటిని అన్ని రంగల్లో అభివృద్ధి చేయడంలో భాగంగా గత ఏడాది కార్తీక పౌర్ణమి సందర్భంగా యాగంటిలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దక్షణ భారతదేశ శైవ క్షేత్రల్లో అరుణాచలంలో వెలిగించే జ్యోతికి ఉన్న విలువ మరో పూజకు లేదు. దీంతో యాగంటిలో కుడా జ్యోతిని వెలిగించి, గిరిప్రదక్షిణ కుడా ఏర్పాటు చేయాలని అంశంలో నిమగ్నమైనట్లు బుధవారం నంద్యాల పట్టణంలోని వైసిపి కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి సమీపంలో ఉన్న గ్రామ ప్రజలను ఆహ్వానించారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతు అరుణాచలం వెళ్లలేని వారు అక్కడ భక్తుల రద్దీని తట్టుకోలేని వారు ఈనెల 26వ తేది రాత్రి యాగంటిలో జరిగే భారీ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. 1250 కీ.లోల ఆవు నెయ్యితో పాటు 150 మీటర్ల పోడవున్న వస్త్రంతో జ్యోతిని వెలిగించే కార్యక్రమం ఆరంభం అవుతుందని రాంభూపాల్ రెడ్డి అన్నారు. ఎంత మంది భక్తులు వచ్చిన వారందరికి ఉచిత ప్రసాదాన్ని అందిచడంతో పాటు నీటి వసతిని కల్పిస్తామని అన్నారు. సమీప గ్రామాలకు చెందిన నాయకులు ఇతరులు ప్రజలకు ఉచితంగా వాహానాలను ఏర్పాటు చేసి భక్తులకు అరుణాచల జ్యోతిని సందర్శించే భాగ్యం కల్పించాలని రాంభూపాల్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమ విజయవంతం కోసం ఏ రూపంలోనైనా ముందుకు రావచ్చని వివరాలకు 94408 29999ను సంప్రదించవచ్చని చెప్పారు. ఈ సమావేశంలో పాణ్యం జడ్పిటిసి సూర్యనారాయణ రెడ్డితో పాటు లలిత కాటన్ మిల్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


