Sunday, September 8, 2024

హంకారి అరవింద్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి

- Advertisement -

హంకారి అరవింద్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి

సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు హెచ్చరిక

కోరుట్ల,
నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు హెచ్చరించారు..
మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ 2019 సంవత్సరంలో తనను పార్లమెంటు సభ్యునిగా గెలిపిస్తే నిజామాబాద్ కు పసుపు బోర్డు తీసుకొస్తానని హామీ ఇచ్చారని అలాగే మూసివేసిన చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ ఇచ్చారని ఒకవేళ ప్రభుత్వం గనుక తెరిపించక పోతే తాను తన సొంత నిధులతో ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మిస్తానని ఆరోజు బాండ్ పేపర్ రాసి ఇచ్చారని అన్నారు.. నేటి వరకు కూడా షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించలేదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ కోసం కమిటీలు వేసి కార్యాచరణతో ముందుకు వస్తూ ఉంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నాడని కృష్ణారావు అన్నారు .. గొప్పలు చెప్పుకునే అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ముత్యంపేట, బోధన్ చక్కెర ఫ్యాక్టరీలు ఉన్నాయని వీటిని ఎందుకు తెరిపించలేక పోతున్నావో ప్రజలకు జవాబు చెప్పాలని అన్నారు.. తాను ఎలాంటి హామీలు ఇవ్వకుండానే ఎలాంటి బాండ్ పేపర్ రాసి ఇవ్వకుండానే ఎన్నికల్లో గెలిచానని చెప్పే ధైర్యం ఉందా అని కృష్ణారావు నిలదీశారు..
నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో కేవలం ఉపన్యాసాలకు ఇతర పార్టీ ల నాయకులను కించ పరచడానికి మాత్రం పనికి వస్తాడని అన్నారు.. తన పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని రెండు ఫ్యాక్టరీలని ఎందుకు తెరిపించలేక పోయాడని జువ్వాడి కృష్ణారావు సూటిగా ప్రశ్నించారు.. అలాగే పసుపు బోర్డు ఇస్తున్నట్టు గత శాసనసభ ఎన్నికల్లో ప్రధానమంత్రి తో అబద్ధపు ప్రచారం చేయించాడని అన్నారు.. ఇప్పటికీ పసుపు బోర్డుకు సంబంధించిన కార్యాలయం బోర్డు ఎక్కడుందో అరవింద్ చూపించాలని
కృష్ణారావు సవాల్ చేశారు.. కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి కాంగ్రెస్ పార్టీలో పెరిగి కాంగ్రెస్ పార్టీ నే కించపరుస్తున్నాడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా విమర్శిస్తున్నాడని బిజెపి, ఎంఐఎం మీరు ముగ్గురిదీ కలిసి ఒకే అజెండా అని దేశంలో జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా ఎంఐఎం బిజెపి యొక్క అరహస్య మిత్రులతో బయటపడ్డదని  ఇద్దరూ ఇద్దరే అని రెండు పార్టీలు ఎదుర్కొంటున్నారని అన్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 60 రూపాయలుగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు 120 రూపాయలు చేశారు.. మెజారిటీ హిందువుల నుంచి ఈ పెట్రోలు ఇతరత్రా పెంచిన ధర భారాన్ని హిందువులు కూడా భరిస్తున్నారని విషయం తెలవదా ఈ రకంగా మతాన్ని వాడుకుంటూ ఎన్నికల్లో గెలుపొందడం తప్ప అభివృద్ధి అనేది భారతీయ జనతా పార్టీ పాలనలో  అని అన్నారు. మీ పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యుడు సుబ్రమణ్య స్వామి, నరేంద్ర మోడీని  అలాగే ఎక్కడైనా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కుతున్నారని బిజెపి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క బాంబు దాడులు జరగలేదని అరవింద్ అంటున్నాడని అయితే పుల్వామా దాడి ఘటన ఏవిధంగా జరిగిందని పుల్వామా దాడి ఘటన బాధ్యులు ఎవరో అప్పుడు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా ఉన్నటువంటి మీ పార్టీకి చెందిన సత్పాల్ మాలిక్ ప్రజలకు వివరించారని అలాంటి సత్పాల్ మాలిక్ ఇంటిపై కూడా ఈరోజు ఈడి దాడులు జరుగుతున్నాయని వాపోయారు..  గత శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన అరవింద్ నేటి వరకు కూడా నియోజకవర్గంలో పర్యటించలేదని అన్నారు. జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పని చేసినటువంటి వ్యక్తి  మరణిస్తే ఆ వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించని పార్లమెంటు సభ్యుడుగా రికార్డులకు ఎక్కాడని అన్నారు.. నీ అహంకారం చూసి నీవు ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కలగజేస్తున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మీ పార్టీ కార్యకర్తలే నీకు టికెట్ ఇవ్వవద్దు అని డిమాండ్ చేస్తున్నారని హైదరాబాద్ పార్టీ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని నీకు టికెట్ ఇవ్వద్దని నిరసన తెలిపారని ఇంతకంటే అవమానం ఇంకే ఉంటుంది అరవింద్ కానీ నవ్విపోదురు నాకేంటి సిగ్గు అన్న చందంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తమ్ముడు నీ పైన పాంప్లెట్స్ పంపిణీ చేస్తున్నాడని ఒక నీచమైన ఆరోపణ చేస్తున్నావని ముందు నీ కార్యకర్తల గురించి ఆలోచించుకోమని నీ కార్యకర్తలని పట్టించు కోకపోవడం వలన నీకు ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని కృష్ణారావు ఎత్తిపొడిచారు.భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆలోచించుకోవాలని ఆ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు మరణించిన స్థానిక ఎంపీ అయి ఉండి ఆ కుటుంబాన్ని ఆదుకోలేదని కనీసం పరామర్శించలేదని ఇక సామాన్య కార్యకర్త విషయంలో అరవింద్ ఏవిధంగా ఉంటాడో ఇప్పటికే బయటపడిందని ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు  విషయమై ఆలోచించుకోవాలని రానున్న ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ ను తుక్కుతుక్కుగా ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కృష్ణారావు కోరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్