కలెక్టరేట్ దగ్గర ఆశా వర్కర్ల సమ్మె

- Advertisement -

కలెక్టరేట్ దగ్గర ఆశా వర్కర్ల సమ్మె

Asha workers strike near Collectorate

కాకినాడ
ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కూటమి ప్రభుత్వం ఆశలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, చేసుకున్న ఒప్పందం మేరకు జీవోలు, సర్కిలర్లు విడుదల చేయాలని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించి, డిఎంహెచ్వో నాయక్ కి వింతపత్రం సమర్పించారు. అనంతరం జిల్లా పరిషత్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ల పద్మ, సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు దువ్వ శేషాబాబ్జి, చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ,ఎన్నికల ముందు కూటమి నాయకులు పోరాడుతున్న ఆశ కార్యకర్తల శిబిరాలు వద్దకు వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆశాల సమస్యలు పరిష్కరిస్తామని జనసేన తెలుగుదేశం నాయకులు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తికావస్తున్న ఏ ఒక్క ఆశా కార్యకర్త సమస్యను పరిష్కరించలేదని విమర్శించారు. పైగా ఆరు నెలల కాలంలో నిత్యవసరాలు సరుకులు విపరీతంగా పెరిగాయని, దానికి తోడు కరెంటు చార్జీలు పెంచారని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఆశలకు 26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒప్పందంలో భాగంగా రిటైర్మెంట్ బెనిఫిట్ 60 వేలు జీవో విడుదల చేయాలని, సర్వీసులో చనిపోయిన ఆశ కార్యకర్త కుటుంబానికి ఇన్సూరెన్స్ వర్తింపజేస్తూ ఆదేశాలు ఇవ్వాలని, ఆన్లైన్, సర్వేల పేరుతో ఆశాలపై మోపుతున్న పని భారాన్ని తగ్గించాలని, రికార్డు బుక్కులు ప్రభుత్వమే ఇవ్వాలని, ఆశాలకు సంబంధం లేని పనులు అప్పగిస్తున్న అధికారులపై కఠీన చర్యలు తీసుకోవాలని, గత సంవత్సరం చేయించిన లెప్రసీ, టీబి సర్వే పారితోషకాలను తక్షణమే విడుదల చేయాలని, స్థానిక సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ ధర్నా కార్యక్రమానికి అంగన్వాడీ యూనియన్ కాకినాడ సిటీ కార్యదర్శి జ్యోతి, జిల్లా కోసాధికారు రమణమ్మ, అర్బన్ హెల్త్ సెంటర్ ఉద్యోగుల సంఘం నాయకులు నాయుడు, రాజారావు, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ మేడిశెట్టి వెంకటరమణ, సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణలు మాట్లాడి మద్దతు తెలియజేసారు.ఈ ధర్నా కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కోసాధికారి నొక్కు లలిత, రాయిడు నాగలక్ష్మి, మడికి లక్ష్మీ, వల్లూరి ఉమావతి, ఉమాదేవి, మీనాక్షి, గంగా భవాని, మంగారత్నం, పిహెచ్. వెంకటలక్ష్మీ, మౌనిక 40 పి.హెచ్.సిల నుండి ఆశా కార్యకర్తల పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular