నేటి నుండి ఆసియా కప్ సంబరాలు!
హైదరాబాద్ :సెప్టెంబర్ 09
Asia Cup celebrations start today!
ఆసియా కప్ 2025 టోర్నీ నేటి నుండి షురూ…. మంగళవారం నుంచి ఆసియా కప్ సంబరాలు మొదలుకానున్నాయి, 8 జట్లు 20 రోజుల పాటు అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ కాంటినెంటల్ టోర్నీలో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.
యూఏఈ, హాంగ్ కాంగ్, ఒమన్ సంచలనాలు సృష్టించేందుకు సై అంటున్నాయి. తొలిసారి ఆసియా కప్ లో 8 జట్లు ఆడుతుండడంతో ఈ టోర్నీ ఆసక్తిగా మారింది. ఇప్పటికే ప్లేయర్లంతా సిద్ధం. ఎనిమిది జట్లు తలపడే ఈ టోర్నీలో ప్రతి క్రికెటరూ కీలకమే. దుబాయ్, అబుదాబి వేదికలుగా ఓవరాల్‌గా 19 మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ జట్ల మధ్య జరగనుంది.
అద్భుతాలు సాధ్యమే ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న రాత్రి 8 గంటలకు మొదలవుతుది. టోర్నమెంట్ దుబాయ్‌లో జరుగుతుంది. ఫైనల్ కూ డా ఇక్కడే జరుగుతుంది. ఆసియా కప్ అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు. ఆసియా దేశాల మధ్య ఒక ఉత్కంఠ భరితమైన పోటీ అని చెప్ప వచ్చు. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి జట్లు సర్ప్రైజ్లు ఇస్తుంటాయి. ఒమన్, యూఏఈ, హాంకాంగ్ లాంటి జట్లు ఈ సారి ఏదైనా అద్భుతం చేస్తాయేమో చూడాలి మరి…
ఈసారి ఆసియా కప్‌ను టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేశారు. ఎందుకంటే 2025 అక్టోబర్‌లో భారత్, శ్రీలంక సంయుక్తంగా టీ20 వరల్డ్ కప్ నిర్వహించబోతున్నా యి. దీంతో అన్ని ఆసియా జట్లు తమ బలహీనతల్ని తెలుసుకునే మంచి ఛాన్స్‌గా ఈ టోర్నీని భావిస్తున్నాయి.
ఈ సారి టోర్నమెంట్ మళ్లీ T20 ఫార్మాట్లో జరగనుంది. అది కూడా 2026లో భారత్, శ్రీలంకల్లో జరిగే ICC T20 వరల్డ్ కప్‌కి సన్నాహకంగా. గతంలో 2022లో శ్రీలంక ఆసియా కప్‌ని గెల్చుకుంది. దుబాయ్‌లో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ జట్టును ఓడించింది. 2023లో జరిగిన గత ఎడిషన్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టైటిల్ నెగ్గిన ఇండియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.


