ఏసియన్ గేమ్స్‌‌ మహిళల క్రికెట్ లో పసిడి సొంతం

- Advertisement -

ముంబై, సెప్టెంబర్ 25, (వాయిస్ టుడే): భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది.  చైనాలోని హాంగ్జౌ వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో బ్యాటింగ్‌లో విఫలమైనా బౌలింగ్‌లో అదరగొట్టింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని  ఆసియా క్రీడల్లో  స్వర్ణం గెలుచుకుంది.   ఏసియన్ గేమ్స్‌‌లో క్రికెట్  ఆడటం భారత్‌కు ఇదే తొలిసారి కావడం గమానార్హం. భారత్ నిర్దేశించిన 117 పరుగుల లక్ష్య ఛేదనలో లంక.. 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 97 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా భారత్.. 19 పరుగుల తేడాతో గెలిచి  పసిడి సొంతం చేసుకుంది.

asian-games-is-the-first-time-in-womens-cricket
asian-games-is-the-first-time-in-womens-cricket
asian-games-is-the-first-time-in-womens-cricket
asian-games-is-the-first-time-in-womens-cricket

హాంగ్జౌ లోని పింగ్‌వెంగ్ వేదికగా  సోమవారం జరిగిన ఫైనల్‌లో  టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన  భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే  స్పిన్‌కు అనుకూలించిన ఈ పిచ్‌పై ఆ లక్ష్యాన్ని చేధించడానికి లంకకు సాధ్యం కాలేదు. భారత స్పిన్నర్ టిటాస్ సాధు  లంకను కోలుకోలేని దెబ్బకొట్టింది.  వరుస ఓవర్లలో వికెట్లు పడగొట్టి లంకను కోలుకోలేకుండా చేసింది. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండటంతో   హర్మన్‌ప్రీత్ తొలి ఓవర్‌నే  స్పిన్నర్ దీప్తి శర్మకు ఇచ్చింది. లంక సారథి చమీర ఆటపట్టు (12 బంతుల్లో 12, 1 ఫోర్, 1 సిక్స్) ఆ ఓవర్లో  సిక్సర్, ఫోర్ కొట్టడంతో 12 పరుగులొచ్చాయి. మూడో ఓవర్ వేసిన సాధు.. తొలి బంతికే సంజీవనిని  ఔట్ చేసింది. ఇదే ఓవర్లో  నాలుగో బంతికి  విష్మి గుణరత్నె (0) ను బౌల్డ్ చేసింది. తొలి ఓవరే డబుల్ మెయిడిన్. ఐదో ఓవర్‌లో సాధు.. కెప్టెన్ ఆటపట్టు పని పట్టింది. రెండో బంతికి  ఆమె.. దీప్తి శర్మ‌కు క్యాచ్ ఇచ్చింది.  ఈ ఓవర్‌లో  జెమీమా  క్యాచ్ మిస్ చేయకుంటే   నీలాక్షి డిసిల్వ వికెట్ కూడా దక్కేది. తొలి ఓవర్లో 12 పరుగులు చేసిన లంక.. ఐదు ఓవర్లలో 15-3గా ఉంది. సాధు జోరుతో  వేగం తగ్గిన  లంక స్కోరుబోర్డుకు హాసిని పెరెరా ఊపు తెచ్చింది.  పూజా వస్త్రకార్ వేసిన  ఆరో ఓవర్లో  ఆమె మూడు ఫోర్లు కొట్టింది. నీలాక్షి డిసిల్వా కూడా కుదరుకున్నట్టే అనిపించింది.  అమన్‌జోత్ కౌర్ వేసిన 9వ ఓవర్లో ఐదో బంతికి ఆమె సిక్సర్ బాదింది. గైక్వాడ్ వేసిన పదో ఓవర్లో పెరెరా.. 4,6 బాదింది. కానీ నాలుగో బంతికి డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడబోయి అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న  వస్త్రకార్ చేతికి చిక్కింది.  పది ఓవర్లకు లంక  నాలుగు వికెట్లు కోల్పోయి 50  పరుగులు చేయగలిగింది.

asian-games-is-the-first-time-in-womens-cricket
asian-games-is-the-first-time-in-womens-cricket
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular