Saturday, February 15, 2025

అమిత్ షా రాజీనామా చేయాలని కోరుతూ

- Advertisement -

అమిత్ షా రాజీనామా చేయాలని కోరుతూ

Asking Amit Shah to resign

పొన్నూరు లో వామపక్షాలు, ప్రజా సంఘాలు నిరసన

పొన్నూరు,
జాతీయ వామపక్షాల పిలుపుమేరకు అమిత్ షా రాజీనామా చేయాలని కోరుతూ పొన్నూరు  ఐలాండ్ సెంటర్ నందు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా ప్రజానాట్యమండలి కార్యదర్శి ఆరేటి రామారావు అధ్యక్షత వహించగా, నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి పుప్పాల సత్యనారాయణ, బుజ్జి,  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండ లక్ష్మీనారాయణ, మాల మహాసభ నాయకులు చైతన్య డీఎస్పీ నాయకులు కిషోర్ బాబు లు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌పై  అవమానకరమైన,అప్రతిష్టాకరమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని  డిమాండ్ చేశారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాపితంగా ఆగ్రహావేశాలు పెల్లుబికినా, నిరసనలు వెల్లువెత్తినా  ప్రధాని నరేంద్ర మోడీ  అమిత్ షాను వెనకేసుకురావడం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగం పెట్టిన బిక్షతోని తుక్కు ఐరన్ అమ్ముకొనే అమిత్ షా దేశానికి హోం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పదవిని అనుభవించడం జరుగుతుందన్నారు. హోం మంత్రిగా అమిత్‌ షా అంబేద్కర్ వై  చేసిన వ్యాఖ్యలు తప్పని ఒప్పుకొని దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మనదేశంలో పెద్ద ప్రమాదం ఉంచి ఉన్నదని అది కేంద్ర  ప్రభుత్వం ద్వారా రానున్న రోజులలో జమిలి ఎన్నికలను  ప్రవేశపెట్టి తద్వారా రాజ్యాంగాన్ని రద్దుచేసి మన దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనుభవిస్తున్న రిజర్వేషన్లను రద్దు చేయడానికి కుట్ర కోణంగా వ్యూహం రచిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు మతోన్మాద బీజేపీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో శరమగీతం పాడి ఇంటికి సాగనంపవలసిన అవసరం ఉందన్నారు, ఈ కార్యక్రమంలో గేయ రచయిత దేవరకొండ శ్రీనివాస్, సిపిఎం శాఖ కార్యదర్శి ప్రభుదాసు, సిపిఎం నాయకులు రమేష, సతీష్, గోవిందరాజులు, బాజీ, నాగరాజు, వీర రాఘవులు, ప్రసాదు,  వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్