Sunday, September 8, 2024

బాధిత మహిళలు, చిన్నారుల రక్షణకు “భరోసా”

- Advertisement -

బాధిత మహిళలు, చిన్నారుల రక్షణకు “భరోసా”

బాధితులు సద్వినియోగం చేసుకోవాలి
డిసిపి చేతన
పెద్దపల్లి
లైంగిక దాడులకు గురైన మహిళలు, బాలబాలికలకు భరోసాగా , రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భరోసా కేంద్రాలను డిజిపీ రవి గుప్తాతో అడిషనల్ డిజిపీలు షికా గొయల్, మహేష్ భగత్ తో  కలిసి వర్చవల్ ద్వారా జనగాంలో నూతనంగా నెలకొల్పబడిన భరోసా కేంద్రం తోపాటు పెద్దపల్లి జోన్ లోని రంగంపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో సీసీసీ నస్పూర్ లో ఉమేన్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన భరోసా కేంద్రాలను ప్రారంభించారు.  ఈ సందర్భంగా పెద్దపల్లి జోన్ డిసిపి చేతన, మంచిర్యాల జోన్ ఏసీపీ లు,  పోలీసు అధికారులతో కలిసి శిలా ఫలాకాన్ని రంగం పల్లిలో ఏర్పాటు చేసిన భవనాన్ని ప్రారంభించారు. భరోసా కేంద్రం ద్వారా లైంగిక దాడులకు గురైన బాధితులకు  పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించబడుతాయని డీసీపీ తెలిపారు. ఇందులో భాగంగానే భాదితులకు న్యాయపరమైన సహకారంతో పాటు వైద్య సహకారాన్ని అందించబడుతుందని, వీటితో పాటు బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. అవసరంనుకుంటే బాధితులకు భరోసా కేంద్రంలో ఆశ్రయం కల్పించబడటంతో పాటు బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందిస్తుందన్నారు .ఈ కేంద్రంలో లీగల్, మెడికల్ సిబ్బంది తో పాటు ఇతర సహాయ సిబ్బందికి సంబందించి  పూర్తిగా మహిళలు విధులు నిర్వహిస్తారని, ముఖ్యంగా బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లనవసరం లేకుండా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందుతాయని  తెలిపారు. ఈ కార్యక్రమంలో  పెద్దపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్, గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస్, మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, జైపూర్ ఏసీపీ మొహన్, బెల్లంపల్లి ఏసీపీ సదయ్య, ఇన్స్ స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్ స్పెక్టర్లు, ఎస్ఐ లు, భరోసా కేంద్రం సిబ్బందితో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్