కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేది రాష్ట్ర కమిటీనా? జాతీయ నాయకత్వమా?
సొంత పార్టీ నేతలపై మరోసారి రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్ మార్చి 23
Raja Singh once again makes harsh comments against his own party leaders
రాష్ట్రానికి త్వరలో కొత్త బిజెపి అధ్యక్షుడు వస్తాడని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేది రాష్ట్ర కమిటీనా? జాతీయ నాయకత్వమా? అని ప్రశ్నించారు. మరోసారి సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొత్త అధ్యక్షుడిని జాతీయ కమిటీ నిర్ణయిస్తే బాగుంటుందని.. రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే కొత్త అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్‌గానే ఉంటారని ఎద్దేవా చేశారు. గతంలో చేసిన అధ్యక్షుడు గ్రూప్ తయారు చేసి పార్టీకి నష్టం చేశారని.. కొత్త అధ్యక్షుడు కూడా అదే గ్రూప్‌ఇజం చేస్తే పార్టీకి మరింత నష్టమని ఆయన అన్నారు.ప్రస్తుతం మంచి నాయకుల చేతులు కట్టి పక్కన పడేశారని.. సీనియర్ నేతలకు స్వేచ్ఛ ఇస్తే తెలంగాణలో బిజెపి ప్రభుత్వం వస్తుందని పేర్కొన్నారు. కొత్త బిజెపి అధ్యక్షుడు సిఎంతో రహస్య భేటీలు నిర్వహించవద్దని అన్న ఆయన అది సీనియర్ నేతలు, కార్యకర్తల మనస్సులో మాట అని దాన్ని బయటపెడుతున్నట్లు తెలిపారు. పార్టీ నేతలకు చెప్పాలే గానీ, మీడియాకు చెప్పవద్దని కొందరు చెబుతున్నారని అన్నారు. పార్టీ పెద్దల దృష్టికి తెస్తే వినకపోతేనే ప్రజల ముందు పెడుతున్న అని తెలిపారు. బిజెపి సీనియర్ నాయకులను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.