
అల్పపీడన ప్రభావంతో ఎగువ కురుస్తు న్న భారీ వర్షాలతో మొదటిసారి ఆకేరు వాగు ప్రవహించినప్పుడు ప్రజలు, రైతులు తొలకరి వర్షాలతో ఆనందం వ్యక్తం చేశారు. రైతులు వరి నార్లు పోసుకొని ఏరువాకను ప్రారంభించారు. కాని రెండవసారి అనగా గత ఐదు, ఆరు రోజుల నుంచి ఎడతెరిపి లేకుం డా కురుస్తున్న వర్షాలతో వాగులు,వం కలు చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తు న్నాయి. ముఖ్యంగా ఆకేరువాగు అత్యంత ప్రమాదకర

స్థాయిలో ప్రవ హిస్తుంది. మరలా భారీ వర్షాలు పడితే లోతట్టు ప్రాంతాలు మునిగే అవకాశం ఉండడంతో వివిధ గ్రామాల ప్రజలను అక్కడ అధికారులు అప్రమత్తం చేస్తు న్నారు.వరంగల్ పాలేరు వాగు పొంగి పొర్లి ప్రవ హిస్తుండడంతో దంతాలపల్లి – పెద్ద ముప్పారం గ్రామాల మధ్య రాకపో కలు పూర్తిగా బంద్ అయ్యా యి.అలా గే నరసింహులపేట మండ లం నుంచి కౌసల్య దేవి పల్లి గ్రామానికి వెళ్లే దారి లో లో లెవెల్ బ్రిడ్జి పై నుండి ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండ డంతో పూర్తిగా రాకపోకలను అధికారు లు నిషేధించారు. అలాగే చిన్నగూడూ రు మండలంలో నుండి పగిడిపల్లి, గుం డం రాజు పల్లి కి వెళ్లేదారిలో జిన్నేల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు నిరంతరం గస్తి కస్తూ రోడ్డుకు అడ్డంగా ముళ్ళకంచని ఏర్పాటు చేశారు.