నిరంతర సాధన తోనో క్రీడాకారులకు మంచి ఫలితాలు
కబడ్డీ అసోసియేషన్ పట్టణాధ్యక్షులు ప్రశాంత్ రావు
జగిత్యాల
క్రీడాకారులు నిరంతర సాధన తోనే మంచి ఫలితాలు సాధిస్తారని కబడ్డీ అసోసియేషన్ జగిత్యాల పట్టణ అధ్యక్షులు, జగిత్యాల వర్తక సంఘం సంయుక్త కార్యదర్శి బోయిన్ పెళ్లి ప్రశాంత్ రావు అన్నారు.సోమవారం జగిత్యాల జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ కోచింగ్ క్యాంప్ ను సందర్శించిన జగిత్యాల పట్టణ అధ్యక్షులు బోయిన్ పెల్లి ప్రశాంత్ రావు సందర్శించారు.
ఈ సందర్భంగా ప్రశాంత్ రావు మాట్లాడుతూ నిరంతర సాధన వల్లనే క్రీడాకారులు మంచి ఫలితాలు సాధిస్తారని కబడ్డీ కోచింగ్ క్యాంపు ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆరే తిరుపతి మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక ఎదుగుదలకు,ఉపయోగపడుతుందన్నారు.
జిల్లా,రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొని జిల్లాకు పెరు తీసుకురావలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాల పిఈటీ రమ్య పాల్గొన్నారు.




