కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో దారుణ ఘటన…
నిర్లక్ష్యానికి నిదర్శనం…!
కామారెడ్డి బ్యూరో పిబ్రవరి10 వాయిస్ టుడే ;
కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐసీయూలో చికిత్స పొందుతోన్న ఓ రోగిని ఎలుకలు కరిచాయి. ఎలుకల దాడిలో రోగి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలను గుర్తించిన రోగి బంధువులు వైద్యుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన ఐసీయూలోకి వెళ్లి పేషెంట్‌పై ఎలుకలు దాడి చేయడం ఏంటని వైద్యులను నిలదీశారు. ఆసుపత్రిలో ఎలుకల బెడదపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అప్రమత్తమైన హాస్పటల్ సిబ్బంది పేషేంట్‌కు మెరుగైన చికిత్స అందించారు. ఎలుకల దాడికి గురైన పేషెంట్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో దారుణ ఘటన…
- Advertisement -
- Advertisement -



