Sunday, September 8, 2024

ఇజ్రాయిల్ లో దారుణం…

- Advertisement -

న్యూఢిల్లీ, అక్టోబరు 18, (వాయిస్ టుడే):  ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులతో పాలస్తీనా గజగజ వణికిపోతోంది. గాజా నగరం బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. ఇజ్రాయెల్ జరుపుతున్న ముప్పేట దాడిలో గాజా స్ట్రిప్ వణికిపోతోంది. మంగళవారం సెంట్రల్‌ గాజాలోని అల్‌ అహ్లీ సిటీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్‌ జరిపిన భారీ వైమానిక దాడిలో 500 మంది పాలస్తీనియన్లు మరణించారు. పలువురు గాయపడ్డారు. పాలస్తీనా అథారిటీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్సులు, ఇతర వాహనాల్లో మరో ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. గాజా నగరం శవాలదిబ్బగా మారిపోతోంది. నగరం లోని మార్చురీలు నిండిపోయాయి. హమాస్‌ను తుదముట్టించే వరకు దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. తాజాగా ఆస్పత్రిలో పేలిన ఘటనలో 500 మందికిపై మృత్యవాత పడ్డారు. అయితే ఈ ఘటనతో తమకు ఎలాంటి సబంధం లేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) కీలక ప్రకటన చేసింది. ఆసుపత్రి పేలుడుకు ఇస్లామిక్ జిహాద్ కారణమని ఐడీఎఫ్ చెబుతోంది. ఈ పేలుడులో ఇజ్రాయెల్ సైన్యానికి ఎలాంటి ప్రమేయం లేదని ప్రకటించింది.

Atrocity in Israel...
Atrocity in Israel…

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా గాజాలోని ఓ ఆసుపత్రిపై ఉగ్రవాదులు రాకెట్లు ప్రయోగించారని ఎక్స్  వేదికగా తెలిపారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రతినిధి గాజాలోని ఒక ఆసుపత్రిపై దాడిపై R.A.D.M. IDF ఆపరేషనల్ సిస్టమ్స్ విశ్లేషణ గాజాలోకి ఉగ్రవాదులు రాకెట్లను కారణం అని డేనియల్ హగారి తెలిపారు. అతను అక్కడ అల్-అహ్లీ హాస్పిటల్ మీదుగా వెళుతున్నారు. దాడి జరిగిన సమయంలో సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.ఈ దాడి ఘటనను ప్రపంచం మొత్తం తెలుసుకోవాలని సూచించారు నెతన్యాహు. గాజాలోని అనాగరిక ఉగ్రవాదులు గాజాలోని ఆసుపత్రిపై దాడి చేశారు. దాడిలో ఐడిఎఫ్‌పై కారణం కాదని నెతన్యాహు ట్విట్టర్‌లో మరొక పోస్ట్‌లో పేర్కొన్నారు. మా పిల్లలను కిరాతకంగా చంపిన వారే.. వారి పిల్లలను కూడా చంపేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  అల్-అహ్లీ అల్-అరబీ ఆసుపత్రిలో జరిగిన పేలుడులో 300 మందికి పైగా మరణించారని గాజా సివిల్ డిఫెన్స్ చీఫ్ అల్-జజీరా టెలివిజన్‌లో తెలిపారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ  అందించిన సమాచారం ప్రకారం కనీసం 500 మరణించాని తెలిపింది.రఫాలో 27 మంది, ఖాన్‌ యూనిస్‌లో 30 మంది మృతి చెందారని గాజా ఆరోగ్య శాఖ మాజీ మంత్రి బసీమ్‌ నయీం చెప్పారు. గాజాలోని హమాస్‌ ప్రభుత్వంలోని ఆసుపత్రిలో ఊచకోత కోశారని ఆరోగ్య మంత్రి మై అల్కైలా ఆరోపించారు. ఈ దాడికి ఇజ్రాయెల్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆరోపించారు. అత్యంత అమానవీయంగా ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడిందని విమర్శించారు. దీనికి ప్రతీకారాన్ని తీర్చుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనను వార్ క్రైమ్‌గా అభివర్ణించారు. ఈ దాడిలో 500 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. ఇజ్రాయెల్‌ 11 రోజుల బాంబు దాడిలో 3,000 మంది మరణించారని గాజాలోని ఆరోగ్య అధికారులు చెప్పారు.ఉత్తర గాజాను విడిచిపెట్టి, తక్షణమే దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్‌ సైన్యం పాలస్తీనియన్లను ఆదేశించింది. అయితే మంగళవారం అక్కడ కూడా భారీ స్థాయిలో వైమానిక దాడులు చేసింది. భారీగా రాకెట్లు ప్రయోగించింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. దక్షిణ గాజాలోని రఫా, ఖాన్‌ యూనిస్‌ నగరాల్లో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఆసుపత్రిపై జరిపిన దాడిలో ఆస్పత్రి పరిసరాలన్నీ భయానకంగా మారిపోయాయి. ఆస్పత్రిలోని హాళ్లు దగ్ధమయ్యాయి. రోగుల శరీరభాగాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడిన దృశ్యాలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే ఇజ్రాయెల్‌ సైన్యం విరుచుకుపడిందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్