జగిత్యాల ఆసుపత్రిలో దారుణం
Atrocity in Jagityala Hospital
జగిత్యాల
జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన రాజనర్సు అనే వృద్ధుడు అనారోగ్యానికి గురి కావడంతో చికిత్స చేయించేందుకు వారం రోజుల క్రితం భార్య
మల్లవ్వ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించింది. అప్పటికే విరిగిన చేతికి బ్యాండేజ్ తో ఉన్న మల్లవ్వ భర్తకు అటెండెంట్ గా ఉంది. బీపీ కారణంగా అస్వస్థతకు గురైన మల్లవ్వ తన భర్త రాజనర్సుకు కేటాయించిన
బెడ్ పై పడుకోగా ఆసుపత్రి సిబ్బంది పేషంట్ కు మాత్రమే కేటాయించిన బెడ్ అని విరిగిన చేయితో బాధపడుతున్న వృద్ధురాలు మల్లవ్వను వీల్ చైర్ లో తీసుకువచ్చి ఆసుపత్రి బయట ఉంచారు. ఆసుపత్రి బయట
అచేతనావస్థతతో వృద్దులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వృద్ధులను తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు. ఇటీవల ఆసుపత్రి సూపరింటిండెంట్
రాములు ను సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ జిల్లా ఆసుపత్రి యంత్రాంగం వైఖరి లో మార్పు రాకపోవడం పై విమర్శలు వెల్లువెత్తున్నాయి