ప్రత్యర్థులపై దాడులు  ఆపి  రాష్ట్రాభివృద్దిపై  దృష్టి  పెట్టాలి

- Advertisement -

ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు —-కాసారం రమేష్

మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడి అరెస్ట్ ను ఖండిస్తున్నాను. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పనిచేసిన అనుభజ్ఞుడిని  హై డ్రామా మధ్య  తెల్లవారు ఝామున అదుపు లో తీసుకున్న పద్దతి రాష్ట్రం లోని సామాన్యులను సైతం భయోత్పాతానికి గురి చేస్తోంది. జాతీయ స్థాయి నాయకుడికె కనీస మర్యాద దక్కని నేపథ్యంలో సామాన్యులు నిర్భయంగా ఉండగలరు? ఆరోపణలు ఉంటె న్యాయబద్దంగా తేల్చుకోవాలి. ప్రజాక్షేత్రంలో  బలాబలాలు నిరూపించు కోవడం   ప్రజాస్వామ్య వ్యవస్థ సంప్రదాయం. అంతేకాని తప్పుడు ఆరోపణలతో పజానాయకులపై కక్ష పూరితంగా వ్యవహరించడం అనాగరికం.  చంద్రబాబు నాయుడు పై వేధింపు చర్యలు పోలీసులు, పాలకపక్షం మానుకోవాలి.  రాజకీయ ప్రత్యర్థులపై దాడులు ఆపి రాష్ట్రాభివృద్దిపై  దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ని కోరుతున్నాము.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular