- Advertisement -
ఆటో కార్మికులను ఆదుకోవాలి
Auto workers should be supported
హైదరాబాద్
ఆటో ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు డిసెంబర్ మొదటి వారంలో చర్చలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని తెలంగాణ ఆటో అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్స్ ఐక్య కార్య చరణ సమితి నేతలు ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆటో కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల్లో ఆటో కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని, చని పోయిన ఆటో డ్రైవర్లకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జేఏసీ నేతలు రవిశంకర్, హబీబ్, పెంటయ్య గౌడ్ తదితరులతో పాటు జేఏసీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో టాక్సీ డ్రైవర్ల ఉపాధిని దెబ్బ తీసే ఓలా ఉబర్ రాపి డ్ అక్రమ వ్యాపారాన్ని నిషేధించాలని, ఆటో డ్రైవర్ల ఉపాధి ని దెబ్బ తీస్తున్న మహాలక్ష్మి పథకం పై రాష్ట్ర ప్రభుత్వం పునర్ ఆలోచన చేయాలని వారు డిమాండ్ చేశారు……
- Advertisement -