మహిళా పోలీసులకు అవగాహన సదస్సు
Awareness Conference for Women Policeనరసరావుపేట రూరల్ సిఐ పి. రామకృష్ణ
నరసరావుపేట,
పల్నాడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నందు మంగళవారం పల్నాడు జిల్లా ఎస్పీ కంచి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నరసరావు పేట రూరల్ సిఐ పి.రామకృష్ణ మహిళా పోలీసులతో గ్రామాల నందు
జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు మరియు మహిళల పట్ల జరుగుచున్న దాడుల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
నరసరావు పేట రూరల్ సిఐ పి. రామకృష్ణ మాట్లాడుతూ, గ్రామాలలో
ఎవరైనా మహిళలు మిస్ అయితే ముఖ్యంగా మైనర్లు మిస్ అయితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, క్షేత్ర స్థాయిలో మహిళా పోలీసులు గ్రామాల్లో తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఉన్న వాస్తవం అధికారులకు తెలియ
పరిచి వాటినీ నిరోధించడానికి పోలీసు అధికారులు తీసుకుంటున్న చర్యలు గురించి, కార్యక్రమ ప్రాధాన్యత గురించి తెలిపినారు.
అదే విధంగా గ్రామాలలో బెల్టు షాపులు నడిపే వారి వివరాలు తమకు తెలియపరచాలని,
గ్రామంలో జులాయిగా తిరుగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేసినారు. ఈ అవగాహన సదస్సు లో సీఐ పి .రామకృష్ణ, ఎస్ఐ సిహెచ్. కిషోర్ మరియు
మహిళా పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.




