Sunday, September 8, 2024

అయోధ్య రాముడికి అత్తగారి ఇంటి నుండి కానుకలు, సంభారాలు వచ్చాయి.

- Advertisement -

||

Ayodhya Rama received gifts and treats from his mother-in-law’s house

||

అల్లుడుగారు ఇల్లు కట్టుకుంటే అత్తగారు కానుకలూ., సంభారాలు పంపడం ఆనవాయితీ…..

అలాగే మేనల్లుడు ఇల్లు కట్టుకుంటే కూడా కానుకలు సంభారాలు పంపడం కూడా ఆనవాయితే.

దీనిని కచ్చితంగా పాటించారు… మరి.

అయోధ్యలో శ్రీరామచంద్రుడు 495 సం.ల తర్వాత నూతనంగా ఇల్లు నిర్మించుకొని జనవరి 22వ తేదీన గృహప్రవేశం చేస్తుండగా అమ్మమ్మ గారి ఇంటి నుండి…, అదేనండి…., వాళ్ళ ఊరు చత్తీస్గడ్ రాష్ట్రంలోని రాయపూర్…, కౌసల్యాదేవి తల్లి గారి ఊరు అక్కడినుండి మేనమామలందరూ కలిసి సంభారాలు తీసుకొచ్చారు ఇలా తేవడాన్ని వాళ్ళేమో “మాయిరా” అంటారు.

ఇప్పుడేమో ఆ పైన కనిపిస్తున్న రెండు ట్రక్కుల నిండుగా శ్రీరాముల వారి అత్తగారి ఊరు మిథిలానగరం అదేనండి నేపాల్ లోని జనక్పూర్, అక్కడి నుండి తమ ఆడపడుచుకు, తమ కూతురుగా భావించే సీతమ్మ తల్లికి.., తామంతా ప్రేమగా పిలిచే ‘కిషోరీ’ కి, ఆభరణాలు, సంభారాలు, సారే, కొత్త బట్టలు, పండ్ల బుట్టలు…. అనేకం తీసుకుని వచ్చి సమర్పించుకున్నారు.. (వాళ్ళేమో “భార్” అంటారు.) ఆయన ప్రతినిధి.., కోర్టులో కూడా బాలరాముడి ప్రతినిధియే అయిన శ్రీచంపత్ రాయ్ గారికి అందించి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించామని ఆనందపడిపోతూ.., ఆనంద భాష్పాలు రాలుస్తూ.., తిరుగు ప్రయాణమయ్యారు.

తిరుగు ప్రయాణంలో జనక్పూర్ జానకి మాత ఆలయం ప్రధాన పూజారి చెప్పిన మాట ఏమిటంటే త్రేతాయుగంలో శ్రీరామలక్ష్మణ భరత శతృజ్ఞులకు – సీతమ్మ తల్లి ఊర్మిళాదేవి మండవి శృతకీర్తులను ఇచ్చి వివాహం చేసి అనేక సంభారాలతో సాగనంపాము… ఆయనకు ఇచ్చిన భూములు ఆయనకు ఇచ్చిన కట్నాలు అన్నింటిని ప్రతి సంవత్సరము సరిచూసి అయోధ్యలో ఇచ్చుకుంటూనే ఉంటాము… కలియుగంలో ఇప్పుడు కూడా ఈ ఆనవాయితీని పాటించామని అన్నారు.

మీకు మరొక విషయం చెప్పాలి:
అత్తారింటికి వెళ్లిన ఆడకూతురి అత్తగారింటి వాళ్లను ఉద్దేశించి ఎత్తిపొడుపులతో.. హాస్యరసమైన పాటలు పాడుతూ కవ్విస్తుంటారు వీటిని “గారి” అని అంటారు… మిథిలా వాసుల హాస్యపు పాటలు చేష్టలు చూసి తీరవలసినదే. 70 – 80 ఏళ్ల వృద్ధులు సైతం రామున్ని బావగా భావించి విచిత్రమైన విన్యాసాలతో పాటలు పాడుతూ కవ్విస్తుండే మాటలు మాట్లాడుతూ ఉండడం అక్కడి సంప్రదాయం అంత మాత్రమే కాదు యావద్దేశం అంతటా ఈ పద్ధతి కొంచెమో గొప్పో ఉండనే ఉంది.

|| ఎంతైనా మన హిందువులు.., యుగాలు మారినా.., తరాలు మారినా తమ సాంప్రదాయాలను నిలబెట్టుకుంటూనే ఉన్నారు… “దీనికి కారణం ఇక్కడి మట్టి వాసనలు మాత్రమే అంటాను నేను, మరి మీరేమంటారు.?

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్