Sunday, September 8, 2024

మంత్రులకు బాబు క్లాస్

- Advertisement -

మంత్రులకు బాబు క్లాస్
విజయవాడ, జూలై 16

Babu class for ministers

మంత్రులకు చంద్రబాబు క్లాస్ పీకారు. మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్న తర్వాత అధికారులను పంపించిన తర్వాత చంద్బాబు మాట్లాడారు. ఈ సందర్భంగా కొంత మంది మంత్రుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు ఎవరి శాఖలు వాళ్లు చూసుకోవాలని ఇతరుల శాఖల్లో జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు.  నిత్యం ప్రజల్లో ఉండేలా చూసుకోండి. వారి సమస్యలపై వెంటనే స్పందించాలని స్పష్టం చేశారు.  గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ప్రజలు తేడా గుర్తించాలన్నారు. కళ్లు నెత్తికెక్కితే చర్యలు తప్పవని మంత్రులతో చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫ్రీ బస్‌ పథకంపై సంబంధిత మంత్రి అధికారిక ప్రకటన చేయకుండా..  మరో మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్వీట్ చేయడం గురించి చంద్రబాబు ప్రస్తావించారు.  రాంప్రసాద్‌ డిపార్టమెంట్ ఇష్యూపై నీవెందుకు స్పందించావంటూ క్లాస్ పీకారు.  చంద్రబాబు క్లాస్‌తో ట్వీట్ డిలీట్ చేశారు అనగాని సత్యప్రసాద్య. ఉచిత ఇసుక విషయంలో కూడా ఎవరూ కలుగచేసుకోవద్దని ఆదేశించారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు. పారదర్శకంగా, ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా వ్యవహరించాలని మంత్రులకు సూచించారు. అక్టోబర్ తర్వాత ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయని..నదుల్లో పూడిక,బోట్ సొసైటీల ద్వారా 80లక్షల టన్నుల ఇసుక వస్తుందన్నారు.  కొత్త మంత్రులు త్వరితగతిన తమ శాఖలపై అవగాహనా పెంచుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ నెల 22 నుంచి ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకోవాలన్నారు. ప్రతి నెలా తమ శాఖలపై రివ్యూ చేసి..వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలన్నారు.కాకినాడలో ద్వారంపూడి కుటుంబం బియ్యం అక్రమాలను మంత్రులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.  తండ్రి పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్, కొడుకు ఎమ్మెల్యే, మరో కుమారుడు రైస్ మిల్లర్ల అసోసియేషన్ చైర్మన్ .. ఇలా  ముగ్గురూ కలిసి బియ్యం రీసైక్లింగ్ చేసి బియ్యం స్మగ్లింగ్ చేశారని.. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు.  ఏం చేద్దాం అనే దానిపై విధి విధానాలతో వచ్చే కేబినెట్  భేటీకి రావాలని చంద్రబాబు సూచించారు.  సీనియర్ మంత్రులు కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలని..  కొత్త వాళ్ళు మంత్రివర్గంలో చాలా మంది ఉన్నారన్నారు. సబ్జెక్ట్ పై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు.  ప్రజలు ఎన్నో ఆశలతో ఉన్నారు, అందుకు తగ్గట్టు మనం పనిచేయాలని సూచించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్