Thursday, January 15, 2026

మాంక్స్ & మంకీస్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ నుంచి రొమాంటిక్ మెలోడీ మొదటి చినుకు సాంగ్ రిలీజ్

- Advertisement -

ప్రదీప్ మాచిరాజు, నితిన్, భరత్, మాంక్స్ & మంకీస్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ నుంచి రొమాంటిక్ మెలోడీ మొదటి చినుకు సాంగ్ రిలీజ్

The romantic melody from Monks & Monkeys' 'Akkada Ammyy Ikka Abbayi' is the first song to be released.

టీవీ యాంకర్ టర్న్డ్ హీరో ప్రదీప్ మాచిరాజు మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ వేసవిలో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 11న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది.
ఈ రోజు మేకర్స్ థర్డ్ సింగిల్ మొదటిటి చినుకు సాంగ్ రిలీజ్ చేశారు. రధన్ స్వరపరిచిన ఈ రొమాంటిక్ మెలోడీ అద్భుతమైన గ్రామీణ నేపథ్యంలో తొలి ప్రేమలోని అమాయకత్వం మ్యాజిక్ అందంగా చిత్రీకరిస్తుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ రాసిన సాహిత్యం అద్భుతంగా వుంది. సిద్ శ్రీరామ్ తన మెస్మరైజింగ్ వోకల్స్ తో ట్రాక్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు. ప్రదీప్ దీపికల కెమిస్ట్రీ, ఆన్-స్క్రీన్ ప్రేమకథ అద్భుతంగా ప్రజెంట్ చేసింది. కొరియోగ్రాఫర్ విశ్వ రఘు వారి ప్రేమకథను బ్యూటీఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ చిత్రీకరించారు.  ప్రదీప్ తొలి చిత్రం లాగానే, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి విడుదలకు ముందే మ్యూజికల్ హిట్‌గా సంచలనాలు సృష్టిస్తోంది.ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎన్ బాలరెడ్డి కెమెరా మ్యాన్ గా పని చేస్తన్నారు, కోదాటి పవనకల్యాణ్ ఎడిటర్. సందీప్ బొల్లా కథ, డైలాగ్స్ అందించగా, ఆశిస్తేజ పులాల ప్రొడక్షన్ డిజైనర్.
తారాగణం: ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, జి ఎం సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ, తదితరులు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్